True Caller Guide : ట్రూ కాలర్ అన్ఇన్‌స్టాల్ చేసినా.. మీ వివరాలు కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ఆ సమస్య ఫసక్..

మన కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే సులభంగా ఎవరో? తెలుసుకోవడానికి వీలుగా ఉండడంతో ఈ యాప్‌కు క్రేజ్ పెరిగేలా చేసింది. మీకు తెలియని నంబర్‌ను కూడా తనిఖీ చేయడానికి ఈ యాప్‌లో అవకాశం ఉంటుంది. వినియోగదారులు స్పామ్ కాల్స్‌ను సులభంగా గుర్తించేలా ఉండడంతో ఈ యాప్‌ను చాలా మంది విరివిగా వాడుతున్నారు.

True Caller Guide : ట్రూ కాలర్ అన్ఇన్‌స్టాల్ చేసినా.. మీ వివరాలు కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ఆ సమస్య ఫసక్..
True Caller 1
Follow us
Srinu

|

Updated on: Mar 30, 2023 | 3:00 PM

ప్రస్తుతం ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా ట్రూ కాలర్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా యువత ఈ యాప్‌ను ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే సులభంగా ఎవరో? తెలుసుకోవడానికి వీలుగా ఉండడంతో ఈ యాప్‌కు క్రేజ్ పెరిగేలా చేసింది. మీకు తెలియని నంబర్‌ను కూడా తనిఖీ చేయడానికి ఈ యాప్‌లో అవకాశం ఉంటుంది. వినియోగదారులు స్పామ్ కాల్స్‌ను సులభంగా గుర్తించేలా ఉండడంతో ఈ యాప్‌ను చాలా మంది విరివిగా వాడుతున్నారు. అయితే ఈ యాప్ వల్ల ఎంతటి లాభాలున్నా అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన వ్యక్తిగత గోప్యతా వివరాలు ప్రతి ఒక్కరికీ వెల్లడయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ట్రూ కాలర్‌ వినియోగించనప్పటికీ చాలా మంది వివరాలు యాప్‌లో డిస్‌ప్లే అవుతుంటాయి. ఎందుకంటే ఎవరైనా సంప్రదింపు వివరాలను సేవ్ చేసి, ఫోన్‌బుక్ కోసం యాప్ యాక్సెస్‌ని ఎనేబుల్ చేసి ఉండవచ్చు. కొంతమంది వినియోగదారులు  యాప్ డేటాబేస్ నుంచి నంబర్‌ను తీసేయడం ఎలా? అని ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు మీ ఖాతాను తొలగించాలనుకుంటే, ప్లాట్‌ఫారమ్ నుంచి మీ పేరును తీసివేయడానికి ఏం చేయాలో? ఓ సారి చూద్దాం.

ట్రూ కాలర్ యాప్ నుంచి పేరును తీసేయండిలా

  • ముందుగా ఫోన్‌లో ట్రూ కాలర్ యాప్‌ను తెరవాలి.
  • యాప్ పై భాగంలో ఎడమ వైపు ఉన్న వ్యక్తుల చిహ్నాన్ని నొక్కాలి.
  • తర్వాత సెట్టింగ్స్ పేజీని ఓపెన్ చేయాలి.
  • అనంతరం గోప్యతా కేంద్రం ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ డీ యాక్టివేట్ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఓ పాప్ అప్ కనిపిస్తుంది. ఖాతాను నిష్క్రియం చేయడం ద్వారా మీ ప్రొఫైల్ డేటాను తొలగించవచ్చు. అక్కడ కొనసాగించాలనుకుంటున్నారా? అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అనంతరం అక్కడ అవును అని క్లిక్ చేయాలి.

పై దశలను అనుసరించడం ద్వారా, మీరు యాప్ నుంచి లాగ్ అవుట్ చేయవచ్చు. తర్వాత, మీరు చేయాల్సిందల్లా మీ ట్రూకాలర్ ఖాతాను నిష్క్రియం చేసి, సేవల నుంచి మీ సంప్రదింపు నంబర్‌ను తీసివేయవచ్చు.

మీ కాంటాక్ట్‌ను అన్‌లిస్ట్ చేయండిలా

ఒక వినియోగదారు తమ ప్రొఫైల్‌ను ట్రూకాలర్ నుంచి తీసివేయాలనుకుంటే ఆ వివరాలను ఇకపై శోధించ లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొదటగా వినియోగదారు వారి ఖాతాను నిష్క్రియం చేయాలి. యాప్ అధికారిక వెబ్‌సైట్ షేర్ చేసిన వివరాల ప్రకారం, మీ హ్యాండ్‌సెట్‌ను అన్‌లిస్ట్ చేయడానికి అనుసరించాల్సిన దశలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • ట్రూకాలర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అందులో ట్రూకాలర్ అన్‌లిట్ ఫోన్ నెంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మీ నెంబర్‌కు +91 జోడించి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • నేను రోబోట్‌ను కాదు అని ధ్రువీకరించాలి.
  • మీరు అన్‌లిస్ట్ చేయడానికి గల కారణాలను ఓ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మన సమస్యను టైప్ చేయడం ఉత్తమం.
  • కారణాన్ని ఎంటర్ చేసిన తర్వాత ధ్రువీకరణ క్యాప్చాను ఎంటర్ చేసి అన్‌లిస్ట్ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • డేటా బేస్ నుంచి నెంబర్ తీసేయడానికి 24 గంటల సమయం పడుతుందని గుర్తుంచుకోవడం ఉత్తమం.
  • అయితే స్పామ్ కింద గుర్తించిన నంబర్‌ను తీయడం మాత్రం కుదరదని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..