AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Hot 30i: హై ఎండ్ ఫీచర్లతో అదిరిపోయే ఫోన్.. కేవలం రూ. 8,999ధరకే.. ఆన్‌లైన్‌లో మాత్రమే దొరుకుతుంది..

తక్కువ బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లతో ఇటీవల లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఫ్లిప్‍కార్ట్ లో విక్రయాలు జరుగుతున్నాయి.

Infinix Hot 30i: హై ఎండ్ ఫీచర్లతో అదిరిపోయే ఫోన్.. కేవలం రూ. 8,999ధరకే.. ఆన్‌లైన్‌లో మాత్రమే దొరుకుతుంది..
Infinix Hot 30i
Madhu
|

Updated on: Apr 04, 2023 | 4:00 PM

Share

తక్కువ బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లతో ఇటీవల లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఫ్లిప్‍కార్ట్ లో అమ్మకానికి వచ్చింది. మీడియాటెక్ హీలియో 4జీ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సామర్థ్యం.. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ వస్తోంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 10 వాట్ల స్టాండర్డ్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం ఈ మొబైల్‍కు యూఎస్‍బీ టైప్-సీ పోర్టు ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే స్టాండ్‌బై మోడ్‌లో 30 రోజుల వరకు పనిచేస్తుంది.

డిస్ ప్లే.. 6.6 ఇంచుల హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్‍ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్ వద్ద వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది.

ఇవి కూడా చదవండి

కెమెరా, స్టోరేజ్.. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఇక ఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని 1టీవీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో ఏఐ లెన్స్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఫీచర్లు, కనెక్టివిటీ.. మైక్రో ఎస్‍డీ కార్డు స్లాట్ ఉండగా.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‍కే ఉంటుంది. డ్యూయల్ సిమ్ 4జీకి సపోర్ట్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ఫేస్‌ అన్‌లాకింగ్‌, సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ అందించారు. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ మొబైల్ బరువు 181 గ్రాములు ఉంటుంది.

ధర.. డైమండ్‌ వైట్‌, గ్లేషియర్‌ బ్లూ, మిర్రర్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉన్న 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఈ ఫోన్‌ ధర.. రూ. 8,999కి అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..