FD Interest: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌తో కళ్లుచెదిరే వడ్డీ..
భారతదేశంలో రిటైరైన ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉంటుంది. వీరు ఆ సొమ్మును కచ్చితంగా అధిక వడ్డీ వచ్చే ఎఫ్‌డీ స్కీముల్లోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందువల్ల బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీను ఆఫర్ చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ అయిన ఫెడరల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై ప్రత్యేక ఎఫ్‌డీ రేట్లను ప్రకటించింది.
భారతదేశ జనాభాలో ఎక్కువ శాతం మంది వేతన జీవులు. సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో చాలా మంది పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే రిటరైన తర్వాత మంచి జీవితానికి ప్రతి నెలా జీతంలో కొంత సొమ్మును పదవీ విరమణ ప్రణాళికలో భాగంగా పొదుపు చేస్తూ ఉంటారు. పదవీ విరమణ ప్రణాళిక అంటే మనం రిటైరైన సమయానికి మనకు ఆ సొమ్ము అందడం. అలాగే కంపెనీలు అందించే పీఎఫ్ ప్రయోజనాలు కూడా చాలా మంది రిటైరైన సమయంలోనే పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే భారతదేశంలో రిటైరైన ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉంటుంది. వీరు ఆ సొమ్మును కచ్చితంగా అధిక వడ్డీ వచ్చే ఎఫ్‌డీ స్కీముల్లోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందువల్ల బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీను ఆఫర్ చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ అయిన ఫెడరల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై ప్రత్యేక ఎఫ్‌డీ రేట్లను ప్రకటించింది. బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవంతో పాటు పండుగ సీజన్‌లో పెట్టుబడిదారులకు ఆకర్షించడానికి ఈ నయా ప్లాన్ ప్రకటించిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ ఎఫ్‌డీలపై ఎంత శాతం వడ్డీను అందిస్తుంది? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ప్రత్యేక వడ్డీ రేట్లు 400 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లకు వర్తిస్తాయని తెలుస్తుంది. ఈ డిపాజిట్లపై అత్యధికంగా 8.15 శాతం వడ్డీను ఫెడరల్ బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లకు 400 రోజుల కాలవ్యవధి కోసం మెచ్యూరిటీకి ముందు విత్‌డ్రా చేసుకోలేని టర్మ్ డిపాజిట్ కోసం 8.15 శాతం వడ్డీను అందిస్తుంది. ఈ పదవీకాలంలో సాధారణ పౌరులకు వడ్డీ రేటు 7.65 శాతంగా ఉంది. 13 నెలలు, 21 నెలల మధ్య (400 రోజులు మినహా) అలాంటి డిపాజిట్ల రేట్లు సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీను అందిస్తుంటే సాధారణ ప్రజలకు 7.55 శాతం వడ్డీను అందిస్తున్నారు.
అయితే ఈ డిపాజిట్లను మెచ్యూరిటీకి ముందు విత్ డ్రా చేస్తే సీనియర్ సిటిజన్లకు 7.90 వద్ద, సాధారణ ప్రజలకు 7.80 శాతం వడ్డీ మాత్రమే వస్తుంది. 13 నెలల నుంచి 21 నెలల మధ్య (400 రోజులు మినహా) పదవీకాలం కోసం విత్‌డ్రా చేయగల డిపాజిట్‌లకు అధిక రేటును పొందవచ్చు.ఈ ప్రత్యేక రేట్లు ఈ పండుగ సీజన్‌లో డిపాజిటర్లకు అదనపు ప్రయోజనాలను అందించడానికి ఈ ప్లాన్స్‌ను రూపొందించామని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి