Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Saving Fd’s: ఈ ఎఫ్‌డీల్లో పెట్టుబడితో పన్ను బాదుడు నుంచి రక్షణ.. కానీ ఈ టిప్స్‌ పాటించాల్సిందే..!

సాధారణంగా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు కనీసం ఐదు సంవత్సరాల కాలవ్యవధితో వస్తాయి. చాలా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులకు అర్హులు. మీరు పన్ను ఆదా చేసే సాధనాలతో మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలనుకుంటే ఎఫ్‌డీలు కూడా సరైన ఎంపిక కావచ్చు. పన్ను ప్రయోజనాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఎంచుకునే ముందు ఫీచర్లు, మెచ్యూరిటీ ప్రయోజనాలు, డిపాజిట్ టర్మ్, వడ్డీ రేటు వంటి కొన్ని అంశాలను విశ్లేషించడం ముఖ్యం.

Tax Saving Fd’s: ఈ ఎఫ్‌డీల్లో పెట్టుబడితో పన్ను బాదుడు నుంచి రక్షణ.. కానీ ఈ టిప్స్‌ పాటించాల్సిందే..!
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Sep 17, 2023 | 6:45 PM

సాధారణ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే చాలా ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన రాబడిని, అధిక వడ్డీ రేటును అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు విస్తృత శ్రేణి పెట్టుబడిదారుల అవసరాలను తీర్చడానికి వివిధ పదవీకాలాలు, పరిమాణాలతో వస్తాయి. తక్కువ వ్యవధి ఉన్న సాధారణ ఎఫ్‌డీలు కాకుండా పన్ను ప్రయోజనాలను అందించే కొన్ని ఎఫ్‌డీలు కూడా ఉన్నాయి. సాధారణంగా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు కనీసం ఐదు సంవత్సరాల కాలవ్యవధితో వస్తాయి. చాలా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులకు అర్హులు. మీరు పన్ను ఆదా చేసే సాధనాలతో మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలనుకుంటే ఎఫ్‌డీలు కూడా సరైన ఎంపిక కావచ్చు. పన్ను ప్రయోజనాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఎంచుకునే ముందు ఫీచర్లు, మెచ్యూరిటీ ప్రయోజనాలు, డిపాజిట్ టర్మ్, వడ్డీ రేటు వంటి కొన్ని అంశాలను విశ్లేషించడం ముఖ్యం. కాబట్టి పన్ను బాదుడు నుంచి రక్షణ పొందే కొన్ని ఎఫ్‌డీల గురించి తెలుసుకుందాం.

పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అనేది బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా అందించబడిన స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలుగా ఉంటుంది. ఇందులో మీరు స్థిరమైన రేటుతో వడ్డీని పొందుతారు. అకాల నిధుల ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ ఫెనాల్టీ చెల్లించడం ద్వారా అలా చేయవచ్చు. మరోవైపు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది స్వల్పకాలిక ఎఫ్‌డీలకు భిన్నంగా ఉంటాయి. అలాగే ఇవి ఐదేళ్ల వ్యవధిలో లాక్‌ని కలిగి ఉంటాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందుగా నిర్ణయించిన వడ్డీ రేట్ల రూపంలో పన్ను ప్రయోజనాలతో పాటు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి.

పన్ను ఆదా ఎఫ్‌డీ లక్షణాలు

  • ఇది సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులను పొందేందుకు పెట్టుబడిదారులను అనుమతిస్తుంది.
  • ఈ పథకంలో కనీసం ఐదేళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
  • సంపాదించిన వడ్డీకి పన్ను విధిస్తారు. కానీ మూలం వద్ద తీసివేస్తారు.
  • ముందస్తు ఉపసంహరణలు లేదా ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) సౌకర్యాలు అందుబాటులో లేవు.
  • స్వీయ-పునరుద్ధరణ ఫీచర్ లేదు.
  • మొత్తం కాలవ్యవధికి వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి.

ఇతర పథకాల కంటే మెరుగా?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (పీపీఎఫ్‌), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్ ఫండ్స్ అనే రెండు ప్రసిద్ధ 8సీC పెట్టుబడుల కంటే పన్ను ఆదా FDలు మెరుగ్గా ఉన్నాయని నిరూపించవచ్చు. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తాయి. ఇది పీపీఎఫ్‌ లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాల కంటే చాలా తక్కువ. అయితే ఈఎల్‌ఎస్‌ మ్యూచువల్ ఫండ్ మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్‌తో వస్తుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్ ఫండ్‌లు తక్కువ లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉన్నప్పటికీ ఈ ఫండ్‌లు స్టాక్ మార్కెట్‌లో మీ నిధులను పెట్టుబడి పెట్టడం ద్వారా పని చేస్తున్నందున రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు స్థిరమైన రాబడితో వస్తాయి. అలాగే ఇవి చాలా సురక్షితమైనవిగా ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?