EPS 95 Scheme: పెన్షన్ రూల్స్ తెలుసా? ఎవరికి ఎంత వస్తుంది? పూర్తి వివరాలు
ఉద్యోగి ప్రాథమిక జీతంతో పాటు డీఏ కలిపి 12 శాతం, యజమాని కంట్రిబ్యూషన్ నుంచి 3.67 శాతం ఈపీఎఫ్‌లో, 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో జమ చేస్తారు. ఈపీఎఫ్ లో ఉన్న వారికి ఈపీఎస్ 95 అనే పథకం ద్వారా ఉద్యోగి కుటుంబానికి రక్షణ, భరోసా ఏర్పడుతుంది. ఈ ఈపీఎస్ 95 పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్.. సంఘటిత రంగంలో పని చేస్తుంటే తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి నెల జీతం నుంచి కొంత భాగం అందులో జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తుంటుంది. పదవీవిరమణ తర్వాత జీవితానికి భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత దీని నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుంది.. అలాగే పెన్షన్ గా కూడా నెల నెలా కొంతమొత్తం వస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉద్యోగితో పాటు యాజమాన్యం కూడా కొంత మొత్తం ప్రతి నెల జమచేస్తుంది. ఉద్యోగి ప్రాథమిక జీతంతో పాటు డీఏ కలిపి 12 శాతం, యజమాని కంట్రిబ్యూషన్ నుంచి 3.67 శాతం ఈపీఎఫ్‌లో, 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో జమ చేస్తారు. ఈపీఎఫ్ లో ఉన్న వారికి ఈపీఎస్ 95 అనే పథకం ద్వారా ఉద్యోగి కుటుంబానికి రక్షణ, భరోసా ఏర్పడుతుంది. ఈ ఈపీఎస్ 95 పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈపీఎస్ స్కీమ్ అంటే..
ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) 95 1995 నుంచి అమలులో ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ప రిధిలోకి వచ్చే అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఈ పథకం కింద కనీసం రూ. 1000 పెన్షన్ పొందే సౌకర్యం 2014 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఉద్యోగి 58 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఎవరైనా ఉద్యోగి కంపెనీలో 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసినట్లయితే, వారు ఈపీఎస్95 పథకం కింద పెన్షన్ పొందేందుకు అర్హులు. అయితే ప్రమాదవశాత్తూ ఎవరైనా ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్థితిలో వితంతు పింఛన్, శిశు పింఛన్, అనాథ పింఛన్ ఇస్తారు.
ఎవరికి ఎంత పెన్షన్ వస్తుంది?
- ఈపీఎస్-95 పథకం కింద, ఉద్యోగి పెన్షన్‌లో వితంతు పెన్షన్, పిల్లల పెన్షన్, అనాథ పెన్షన్ ఉన్నాయి.
- వితంతు పింఛను కింద, ఉద్యోగికి భార్య లేదా ఉద్యోగి భర్తకు రూ. 1,000 వరకు పొందవచ్చు.
- ఒకవేళ పింఛనుదారు మరణిస్తే 50 శాతం పింఛను వితంతువుకు చెల్లిస్తారు.
- ఉద్యోగి మరణించే సమయానికి పిల్లల వయస్సు 25 ఏళ్లలోపు ఉన్నప్పుడే పిల్లలకు పెన్షన్ ఇస్తారు.
- ఈ పరిస్థితిలో వితంతు పింఛనులో 25 శాతం చెల్లిస్తారు.
- ఈ సదుపాయాన్ని ఒకేసారి ఇద్దరు పిల్లలకు ఇవ్వవచ్చు.
- పిల్లలు అనాథలైతే వారికి 25 ఏళ్లు వచ్చే వరకు పింఛనులో 75 శాతం అందజేస్తారు.
- పిల్లలు శారీరకంగా వికలాంగులైతే, వారి జీవితాంతం 75 శాతం పెన్షన్ ఇస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..