Business Ideas: చెట్లే కాదు.. ఆకులతోనూ మంచి సంపాదన.. వీటిని పండించడానికి కష్టపడాల్సిన పనేలేదు..!
దేశంలో అధిక జనాభాకు వ్యవసాయమే ఆదాయ వనరు. అయితే దేశంలో వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న కోట్లాది మంది రైతుల పరిస్థితి అంత బాగా లేదు.

దేశంలో అధిక జనాభాకు వ్యవసాయమే ఆదాయ వనరు. అయితే దేశంలో వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న కోట్లాది మంది రైతుల పరిస్థితి అంత బాగా లేదు. ఆర్థిక స్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఎపిసోడ్‌లో మనం మీకు చాలా ప్రత్యేకమైన వ్యవసాయం గురించి చెప్పబోతున్నాం. దీని ద్వారా, బాగా సంపాదించవచ్చు. టెండు ఆకుల సాగు గురించి చెప్పబోతున్నాం. దేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో టెండుపట్టాను ఎక్కువగా సాగు చేస్తున్నారు. బీడీలు చేయడానికి టెండు ఆకులను ఉపయోగిస్తారు.. టెండు ఆకుల వ్యాపారంతో చాలా మంది రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేయడం ద్వారా మీరు లైసెన్స్ పొందవచ్చు. టెండు లీవ్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు GST రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. టెండు ఆకులకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పుడే వాటిని చెట్ల నుంచి తెంపాలి. టెండు ఆకులను నిల్వ చేయడం కష్టమైన పని. అవి చాలా త్వరగా తడిసిపోతాయి. ఇది నేరుగా వాటి ధరలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. టెండు ఆకుల బస్తాను మార్కెట్‌లో దాదాపు రూ.4 వేలకు సులభంగా విక్రయిస్తున్నారు.
మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మీకున్న కొద్ది భూమిలో దీన్ని ప్రారంభించవచ్చు. ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. మీ గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఈ పంటను ప్రారంభించవచ్చు. దీన్ని పండించేందుకు నీరు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ చెట్లు వర్షంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో చెట్టుకు పది నుంచి పదిహేను కట్టల వరకు ఆకులను ఉత్పత్తి చేయవచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే..మీరుకూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఖాళీగా కూర్చునే బదులు ఇలాంటి పెట్టుబడిలేని పంటలను సాగుచేస్తే…శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది.




మరిన్ని బిజినెస్ సంబంధిత వార్తల కోసం…