Pre-EMI Option: ప్రీ- ఈఎంఐ అంటే ఏమిటి..? ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?
సాధారణంగా హోమ్ లోన్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటే. అయితే హోమ్ లోన్ గురించి ఆరా తీసినప్పుడు ప్రీ- ఈఎంఐలు అనే మాట విని ఉంటారు. వీటి గురించి పెద్దగా ఎవ్వరికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ప్రీ- ఈఎంఐ రుణాలు అంటే ఏమిటి? వీటికి ఎవరు తీసుకుంటారు..? ఒక వేళ తీసుకుంటే చెల్లించే..
సాధారణంగా హోమ్ లోన్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటే. అయితే హోమ్ లోన్ గురించి ఆరా తీసినప్పుడు ప్రీ- ఈఎంఐలు అనే మాట విని ఉంటారు. వీటి గురించి పెద్దగా ఎవ్వరికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ప్రీ- ఈఎంఐ రుణాలు అంటే ఏమిటి? వీటికి ఎవరు తీసుకుంటారు..? ఒక వేళ తీసుకుంటే చెల్లించే విధానం ఏమిటి ? అనే విషయాలు తెలుసుకుందాం.
ఓపెన్ ప్లాట్‌లో ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ప్రీ-ఈఎంఐ రుణాలను ఎక్కువగా తీసుకుంటారు. ఈ తరహా గృహ రుణాల్లో పూర్తయ్యే ఇంటి నిర్మాణాన్నిబట్టి బ్యాంకుల నుంచి విడుతలవారీగా నిధులు విడుదల అవుతుంటాయి. మొదటి విడతలో డబ్బులు అందుకున్నప్పటి నుంచి ఈ ప్రీ-ఈఎంఐలు ప్రారంభం అవుతాయి. తీసుకున్న మొత్తాలకు కేవలం వడ్డీని చెల్లించడమే ఇందులో ఉంటుంది.
ఇల్లు పూర్తయ్యే వరకు బ్యాంకుల నుంచి దశలవారీగా నిధులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆగిపోతాయో అసలు ఈఎంఐలు మొదలవుతాయని గుర్తించాలి. అప్పటిదాకా మీరు తీసుకున్న అసలుకు ఈ ప్రీ-ఈఎంఐల రూపంలో వడ్డీలను చెల్లిస్తూ ఉండాలన్నట్లు. అయితే ప్రీ-ఈఎంఐలు అనేవి పూర్తిగా గృహ రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులే. మీరు తీసుకున్న రుణంలో నయా పైసకూడా చెల్లించినట్లు కాదు. అందుకే అసలు ఈఎంఐల కంటే ఈ చెల్లింపులు తక్కువ.
మీకు ఏ వడ్డీరేటుకైతే సాధారణ గృహ రుణం లభిస్తుందో.. దాదాపు అదే వడ్డీరేటు ప్రకారమే ఈ ప్రీ-ఈఎంఐలు ఉంటాయి. ఇక రోజువారీ లెక్కన వీటిని గణిస్తాయి బ్యాంకులు. అసలు ఈఎంఐలు మొదలయ్యేదాకా నెలనెలా వీటిని చెల్లించాల్సి ఉంటుంది. ప్రీ-ఈఎంఐలకు ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. అసలు ఈఎంఐలు మొదలైనప్పుడే ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అలాగే ఈ ప్రీ-ఈఎంఐల ప్రభావం రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌పైనా ఏమాత్రం ఉండబోదని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి