PNB Rule: ఖాతాదారులకు షాకివ్వనున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు.. ఇలా చేయకపోతే మీ జేబుకు చిల్లులే..!
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉందా? ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మే 1 నుంచి జేబుకు చిల్లలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకు షాకివ్వనుంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే ఛార్జీల భారం పడే అవకాశం ఉంది. సేవింగ్స్..
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉందా? ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మే 1 నుంచి జేబుకు చిల్లలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకు షాకివ్వనుంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే ఛార్జీల భారం పడే అవకాశం ఉంది. సేవింగ్స్ అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని కోసం బ్యాంకు అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తుంది. దానిపై జీఎస్టీ కూడా ఉంటుంది. మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు నిబంధనలు మారుతుండటంతో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అధిక ఛార్జీలు మోయక తప్పదు.
PNBలో కనీస బ్యాలెన్స్ మొత్తం:
- నగరంలోని ఏదైనా శాఖలో సేవింగ్స్ ఖాతా ఉంటే, అక్కడ కనీస బ్యాలెన్స్ 10,000 ఉంచాలి.
- ఆర్బన్ శాఖలో – రూ.5,000
- గ్రామీణ ప్రాంత శాఖలో – రూ. 2,500
డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీకి వార్షిక రుసుమును కూడా పెంచాలని బ్యాంకు యోచిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా POS, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలకు ప్రవేశ ఛార్జీలను పెంచవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఈ పాలసీ మార్పు గురించి తెలుసుకోవాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి