AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: పీఎం కన్యా ఆశీర్వాద్ యోజన పథకం కింద కేంద్రం కుమార్తెలకు రూ.1.50 లక్షలు ఇస్తోందా? ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు

ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని నిజమైనవి ఉంటాయి.. కొన్ని ఫేక్‌ ఉంటాయి. అయితే ఎక్కువ వైరల్‌ అయ్యేవి ఫేక్‌ న్యూస్‌. తాజాగా..

Fact Check: పీఎం కన్యా ఆశీర్వాద్ యోజన పథకం కింద కేంద్రం కుమార్తెలకు రూ.1.50 లక్షలు ఇస్తోందా? ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు
PIB Fact Check
Subhash Goud
|

Updated on: Oct 08, 2022 | 4:39 PM

Share

ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని నిజమైనవి ఉంటాయి.. కొన్ని ఫేక్‌ ఉంటాయి. అయితే ఎక్కువ వైరల్‌ అయ్యేవి ఫేక్‌ న్యూస్‌. తాజాగా ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వారికి 1.50 రూపాయలు అందిస్తోందని దీని సారాంశం. ఈ మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఇదే వాదనను వినిపించాయి. మీరు కూడా ఈ వైరల్ సందేశాన్ని చూసినట్లయితే, ఈ క్లెయిమ్‌ను విశ్వసించే ముందు అసలు నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణ చేసింది. ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ప్రభుత్వం నిజంగా ఏదైనా పథకాన్ని ప్రారంభించిందో లేదో తెలుసుకోండి.

పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ నిజమెంతా..?

ప్రజలను తప్పుదారి పట్టించే వార్తల నుండి రక్షించడానికి ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తలను వాస్తవికంగా తనిఖీ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పీఐబీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ‘పీఎం కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయడం లేదని పీఐబీ తన ట్వీట్‌లో పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇది పూర్తిగా ఫేక్. అలాంటి సందేశాల ముసుగులో పడి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మీరు వైరల్ సందేశాన్ని కూడా అనుమానించినట్లయితే, మీరు దాని వాస్తవాన్ని తనిఖీ చేయాలనుకుంటే పీఐబీ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం, మీరు దాని అధికారిక లింక్ ను సందర్శించడం ద్వారా మీ వార్తల వాస్తవాన్ని తనిఖీ చేయవచ్చు. అదే సమయంలో మీకు కావాలంటే మీరు దాని వాట్సాప్‌ నెంబర్‌ 8799711259 లేదా ఇమెయిల్ ఐడి కి మెయిల్ చేయడం ద్వారా చేసిన ఇలాంటి ఫేక్‌ స్కీమ్‌ల గురించి తనిఖీ చేసి వివరాలు పొందవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా పథకానికి దరఖాస్తు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. మీరు ఇలా చేయకపోతే, మీరు సైబర్ మోసానికి గురవుతారు. తస్మాత్‌ జాగ్రత్త.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!