Fact Check: మోడీ సర్కార్ ‘శ్రామిక్ సమ్మాన్ యోజన’ పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ రూ.5,100 అందిస్తోందా?
మోడీ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథఖాలను అమలు చేస్తోంది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. అయితే ఇలాంటి పథకాలను ఆసరాగా చేసుకుని మోసాలు కూడా జరుగుతున్నాయి. కొందరు అమాయకులను మోసగించేందుకు సోషల్ మీడియా ద్వారా నకిలీ సందేశాలను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ..

మోడీ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథఖాలను అమలు చేస్తోంది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. అయితే ఇలాంటి పథకాలను ఆసరాగా చేసుకుని మోసాలు కూడా జరుగుతున్నాయి. కొందరు అమాయకులను మోసగించేందుకు సోషల్ మీడియా ద్వారా నకిలీ సందేశాలను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే దేశంలోని ప్రతి వర్గానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. బాలికలు, మహిళలను స్వావలంబన చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాల గురించి సమాచారాన్ని పొందడానికి ప్రజలు సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. గత కొన్ని రోజులుగా NITI GYAN 4 U అనే యూట్యూబ్ ఛానెల్ ప్రభుత్వ పథకం గురించి తెలియజేస్తోంది. మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘శ్రామిక్ సమ్మాన్ యోజన’ ప్రారంభించిందని, దీని ద్వారా మహిళలు ప్రతినెల రూ.5,100 పొందవచ్చని సూచిస్తోంది. దీనిని చూసిన చాలా మంది నిజం అనుకుంటున్నారు.




दावा?
‘NITI GYAN 4 U’ नामक #YouTube चैनल के एक वीडियो के अनुसार, केंद्र सरकार “श्रमिक सम्मान योजना” के तहत महिलाओं को प्रति माह ₹5100 दे रही है।
तथ्य ✅
▪️ यह दावा फ़र्ज़ी है।
▪️ भारत सरकार द्वारा “श्रमिक सम्मान” नामक कोई भी योजना नहीं चलाई जा रही है।#PIBFactCheck pic.twitter.com/zy0MRYL2UK
— PIB Fact Check (@PIBFactCheck) May 31, 2023
ఇందులో నిజమెంత..?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిందని ఈ యూట్యూబ్ ఛానెల్ పేర్కొంది. ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి నెలా రూ.5,100 పొందుతున్నారు. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెబుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ క్లెయిమ్‌ను వాస్తవంగా తనిఖీ చేసి క్లారిటీ ఇచ్చింది. ఈ ఛానెల్ వచ్చిన వార్త పూర్తిగా నకిలీదని, కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీనిని నమ్మి ఎవ్వరు కూడా మోసపోవద్దని సూచించింది. ఇందులో ఈ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని తేలింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి