PPF vs Sukanya Samriddhi: పీపీఎఫ్‌ -సుకన్య సమృద్ధి యోజన.. ఈ రెండింటిలో తేడా, ప్రయోజనాలు ఏమిటి?

మీరు మీ పిల్లల, కుటుంబ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మీరు వివిధ పొదుపు పథకాలు గురించి ఆలోచించడం మంచిది. ఇందులో భాగంగా పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం..

PPF vs Sukanya Samriddhi: పీపీఎఫ్‌ -సుకన్య సమృద్ధి యోజన.. ఈ రెండింటిలో తేడా, ప్రయోజనాలు ఏమిటి?
Ppf Vs Sukanya Samriddhi
Follow us

|

Updated on: May 31, 2023 | 4:32 AM

మీరు మీ పిల్లల, కుటుంబ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మీరు వివిధ పొదుపు పథకాలు గురించి ఆలోచించడం మంచిది. ఇందులో భాగంగా పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి రాబడిని పొందవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) రెండింటిలోనూ మంచి రాబడిని పొందవచ్చు. మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అయితే ఈ రెండు పథకాల్లో ఏది బెటర్ అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. మీరు పీపీఎఫ్‌లో ఏ పేరుతోనైనా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ సుకన్య సమృద్ధి యోజనలో మీరు మీ ఆడ పిల్ల పేరుపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. ఇది వివాహం సమయంలో, చదువుల నిమిత్తం సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది.

పీపీఎఫ్‌ లేదా సుకన్య సమృద్ధి యోజన:

పీపీఎఫ్‌ స్కీమ్‌లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజనపై 8 శాతం వడ్డీ లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో సుకన్య సమృద్ధి యోజన మంచిదని మీరు భావిస్తుంటారు. కానీ మీరు రెండు పథకాలలో పెట్టుబడి పెట్టాలి. పీపీఎఫ్‌లో తక్కువ వడ్డీ లభిస్తున్నప్పటికీ, తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

పీపీఎఫ్‌ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు :

పీపీఎఫ్‌ 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత 5-5 సంవత్సరాలకు మరింత పొడిగించవచ్చు. ఇది సురక్షితమైన పెట్టుబడి. ఈ రెండు పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు పొందవచ్చు.

సుకన్య సమృద్ధి స్కీమ్‌ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు:

మీరు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. దీనికి పీపీఎఫ్ కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి కారణం ఇదే. ఈ పథకంలో మీరు కుమార్తె వయస్సు 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్రదాడి ముప్పు.. పాకిస్థాన్ నుంచే స్కెచ్..
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్రదాడి ముప్పు.. పాకిస్థాన్ నుంచే స్కెచ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..