AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Property Tax: మీరు కొత్త ఇల్లు కొన్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించకపోతే ఏమవుతుంది?

దేశవ్యాప్తంగా కొత్త ఇళ్లు, ఫ్లాట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. 2022లో దేశంలోని టాప్ 7 నగరాల్లో 3.6 లక్షలకు పైగా ఇళ్లను విక్రయాలు జరిగినట్లు ఒక నివేదిక పేర్కొంది. మీరు కూడా గృహ కొనుగోలుదారుల జాబితాలో ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా ఆస్తి..

Property Tax: మీరు కొత్త ఇల్లు కొన్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించకపోతే ఏమవుతుంది?
New House
Follow us
Subhash Goud

|

Updated on: May 30, 2023 | 5:40 AM

దేశవ్యాప్తంగా కొత్త ఇళ్లు, ఫ్లాట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. 2022లో దేశంలోని టాప్ 7 నగరాల్లో 3.6 లక్షలకు పైగా ఇళ్లను విక్రయాలు జరిగినట్లు ఒక నివేదిక పేర్కొంది. మీరు కూడా గృహ కొనుగోలుదారుల జాబితాలో ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా ఆస్తి పన్ను గురించి తెలుసుకోవాలి. ఆస్తిపన్ను చెల్లించకపోతే ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి. ఆస్తిపన్ను వసూలు చేసే పని మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ కేవలం ఇల్లు లేదా ఫ్లాట్ ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేస్తుంది. మీ ఇల్లు ఏ కార్పొరేషన్ ఏరియాలో ఉందో ఆ ప్రాంత అధికార యంత్రాంగానికి ఆస్తిపన్ను వసూలు చేసే హక్కు ఉంది.

ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో..

ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో మున్సిపల్ అథారిటీ ఫ్లాట్ యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, బకాయి ఉన్న మొత్తాన్ని రికవరీ చేయమని కోరవచ్చు. అయితే ఫ్లాట్ యజమాని నిర్ణీత గడువులోగా పన్ను డబ్బు చెల్లించలేనప్పుడు షోకాజ్ నోటీసు ఇవ్వబడుతుంది. దీని తరువాత అధికార అధికారి, న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత యజమానికి నోటీసు పంపుతారు. డీఎంసీ చట్టం, 1957లోని సెక్షన్ 155, 156 ప్రకారం, ఫ్లాట్ లేదా ఇంటి యజమాని ఆస్తిని అటాచ్ చేయవచ్చు. బ్యాంక్ ఖాతా, అద్దె, అన్ని చరాస్తులను అటాచ్ చేయవచ్చు.

20% వరకు జరిమానా విధించవచ్చు:

ఢిల్లీలో ఆస్తిపన్ను చెల్లించనందుకు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. నోటీసు ఇచ్చినప్పటికీ యజమాని ఆస్తిపన్ను చెల్లించకపోతే, అతనిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందులో బకాయి మొత్తంలో 20% జరిమానాగా వసూలు చేస్తారు. డిఫాల్టర్ యజమాని జరిమానా కూడా చెల్లించకపోతే, అతని ఆస్తిని అటాచ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. అంతే కాదు, డిఫాల్టర్‌కు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి