Tork Kratos R: క్రాటోస్ బైక్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. స్టైలిష్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్ల బైక్ వివరాలివే..!
పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ క్రాటోస్ ఆర్‌పై రూ. 32,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో రూ. 22,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. అదనంగా టోర్క్ తన కస్టమర్లకు రూ. 10,500 విలువైన ప్రత్యేకమైన సర్వీస్ బండిల్‌ను ఉచితంగా అందిస్తోంది.
భారతీయ ఆటోమొబైల్ రంగంలో రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా యువత నయా బైక్స్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టోర్క్ మోటార్స్ దాని ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ క్రాటోస్ ఆర్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ క్రాటోస్ ఆర్‌పై రూ. 32,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో రూ. 22,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. అదనంగా టోర్క్ తన కస్టమర్లకు రూ. 10,500 విలువైన ప్రత్యేకమైన సర్వీస్ బండిల్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇందులో పొడిగించిన వారంటీ, డేటా ఛార్జీలు, ఆవర్తన సేవా ఛార్జీలు మరియు ఛార్జ్‌ప్యాక్ ఉన్నాయి. టోర్క్ కంపెనీకు చెందిన క్రాటోస్ బైక్ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
క్రాటోస్ ఆర్ బైక్ రెండు వేరియంట్‌లలో అందిస్తారు. అర్బన్, స్టాండర్డ్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ బైక్ వరుసగా రూ. 1.68 లక్షల నుంచి రూ. 1.87 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ నాలుగు రంగుల ఎంపికలలో ఉంటుంది తెలుపు, నీలం, ఎరుపు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. క్రాటోస్ ఆర్ 9 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 38 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 4 కేడబ్ల్యూహెచ్, ఐపీ 67 సర్టిఫైడ్, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీ 180 కి.మీల ఐడీసీ (ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ బైక పూర్తిగా చార్జ్ చేశాక దాదాపు 120 కి.మీ అందిస్తుంది.
పనితీరు విషయానికొస్తే క్రాటోస్‌ఆర్ గరిష్టంగా 105 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదు. అయితే ఇది 3.5 సెకన్లలో 0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు వేరియంట్‌లలోని ప్రామాణిక ఫీచర్‌లలో పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బహుళ రైడ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, మొబైల్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్, ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, ఓటీఏ అప్‌డేట్‌లు ఈ బైక్‌ల ప్రత్యేకతలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..