AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: ఈ ఎలక్ట్రిక్ బైక్ గేమ్ ఛేంజర్.. గంటకు 200కిలోమీటర్ల వేగం.. టాప్ బ్రాండ్లకు ఏ మాత్రం తీసుపోదు..

ప్రముఖ దేశీయ బ్రాండ్, బెంగళూరు కేంద్రంగా నడిచే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఓ పెద్ద ప్రయోగమే చేసింది. ఏకంగా హై స్పీడ్ స్పోర్ట్స్ బైక్ ని తీసుకొస్తోంది. దీనిని టెస్ట్ డ్రైవ్ చేసి, ఏకంగా గంటకు 200కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో టీజర్ ను విడుదల చేసింది. ఈ షార్ట్ వీడియోలో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గంటకు 195కిలోమీటర్ల వేగాన్ని చాలా సులభంగా అందుకుందని.. గరిష్టంగా 200పైగా వేగాన్ని అందుకోగలదని ప్రకటించింది.

Electric Bike: ఈ ఎలక్ట్రిక్ బైక్ గేమ్ ఛేంజర్.. గంటకు 200కిలోమీటర్ల వేగం.. టాప్ బ్రాండ్లకు ఏ మాత్రం తీసుపోదు..
Ultraviolette New Electric Bike
Madhu
| Edited By: |

Updated on: Nov 07, 2023 | 9:15 PM

Share

మన దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ శ్రేణి వాహనాల్లో ఇప్పటి వరకూ మనం స్కూటర్లు, బైక్, పలు కంపెనీల కార్లు చూశాం. ద్విచక్ర వాహన శ్రేణిలో స్కూటర్లకు ఎక్కువ డిమాండ్ ఇక్కడ ఉంది. కాగా ఎలక్ట్రిక్ బైక్ ల విషయంలో మాత్రం కాస్త వెనుకబడే ఉన్నామని చెప్పాలి. అందుబాటులో ఉన్న కొద్ది బైక్ లు కూడా పెద్దగా ఎవరికీ తెలియనివే. ఈ నేపథ్యంలో ప్రముఖ దేశీయ బ్రాండ్, బెంగళూరు కేంద్రంగా నడిచే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఓ పెద్ద ప్రయోగమే చేసింది. ఏకంగా హై స్పీడ్ స్పోర్ట్స్ బైక్ ని తీసుకొస్తోంది. దీనిని టెస్ట్ డ్రైవ్ చేసి, ఏకంగా గంటకు 200కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో టీజర్ ను విడుదల చేసింది. ఈ షార్ట్ వీడియోలో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గంటకు 195కిలోమీటర్ల వేగాన్ని చాలా సులభంగా అందుకుందని.. గరిష్టంగా 200పైగా వేగాన్ని అందుకోగలదని ప్రకటించింది. ఈ బైక్ ని ఈఐసీఎంఏ వేదికగా పరిచయం చేసింది. అయితే పేరును రివీల్ చేయలేదు. వచ్చే నెలలో మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ లోపు విడుదల చేసిన ఈ క్లిప్ ఈ బైక్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prashant Singh Shekhawat (@prashant_shekhawat69)

ఎఫ్99 కాన్సెప్ట్ తోనే..

అల్ట్రావయోలెట్ కంపెనీ నుంచి వస్తున్న ఈ పేరు తెలియని హై స్పీడ్ స్పోర్ట్స్ బైక్ గ్లోబల్ వైడ్ గా వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశంది. ఇది ఎఫ్99 కాన్సెప్ట్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్ అని కంపెనీ ప్రకటించింది. దీనికి అదనంగా కంపెనీ ఎక్స్44 కాన్సెప్ట్ బైక్ ను కూడా తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇది గతంలో చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేసిన విషం తెలిసిందే. నేమ్ ప్లేట్ విషయంలో హీరో మోటోకార్ప్ తో లీగల్ ఇష్యూలు రావడంతో ఇది చాలా వివాదాస్పదం అయ్యింది.

గేమ్ ఛేంజర్..

అల్ట్రావయోలెట్ కంపెనీ నుంచి వస్తున్న ఈ హై స్పీడ్ స్పోర్ట్స్ లుక్ ఎలక్ట్రిక్ బైక్ ప్రపంచ టూ వీలర్ మార్కెట్లోనే ఓ గేమ్ ఛేంజర్ కాగలదని కంపెనీ చెబుతోంది. ఇది అధిక స్పెక్స్ కలిగిన ప్రీమియం ద్విచక్ర వాహనాలతో పోటీ పడుతుందని ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఎఫ్77 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 30.2కేడబ్ల్యూ సామర్థ్యంతో వస్తుంది. ఇది 40.4బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇది 100ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.9 సెకండ్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 152 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. అయితే ఇప్పుడు టీజర్లో విడుదల చేసిన కొత్త మోడల్ బైక్ లో దీని కన్నా అధిక సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. దాని సాయంతో గంటకు 200కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. ఈ కొత్త బైక్ సంబంధించి పూర్తి వివవరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..