Insurance Policies: ఇన్సూరెన్స్ పాలసీదారులకు అలెర్ట్.. మారుతున్న కీలక నిబంధనలు
భారతదేశంలో బీమా పాలసీలు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్‌లు ఫీచర్లు, ఇతర నిబంధనలు, షరతులను అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. అందువల్ల పాలసీదారులు మొత్తం పత్రాన్ని చదవడం మానేస్తున్నారు. ముఖ్యంగా పాలసీలోని నిబంధనలు చిన్న అక్షరాలతో పేర్కొనడం ద్వారా చాలా మంది చదవడానికి ఇష్టపడడం లేదు. అలాగే సింపుల్‌గా చదివనట్లు ధ్రువీకరిస్తూ సంతకం కూడా చేసేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలో సంపాదించే వ్యక్తి కీలకంగా ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో సంపాదించే వ్యక్తి భౌతికంగా దూరమైతే ఆ కుటుంబం చిన్నాభినమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాల ఆర్థిక రక్షణ కోసం బీమా పాలసీలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే భారతదేశంలో బీమా పాలసీలు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్‌లు ఫీచర్లు, ఇతర నిబంధనలు, షరతులను అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. అందువల్ల పాలసీదారులు మొత్తం పత్రాన్ని చదవడం మానేస్తున్నారు. ముఖ్యంగా పాలసీలోని నిబంధనలు చిన్న అక్షరాలతో పేర్కొనడం ద్వారా చాలా మంది చదవడానికి ఇష్టపడడం లేదు. అలాగే సింపుల్‌గా చదివనట్లు ధ్రువీకరిస్తూ సంతకం కూడా చేసేస్తున్నారు. అయితే బీమా పాలసీ ప్రాథమిక లక్షణాలను సాధారణ పదాల్లో, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లో అందించిన ముందే నిర్వచించిన ఫార్మాట్‌లో జాబితా చేయాలని బీమా సంస్థలకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌డీఏఐ ఆదేశించిన తాజా నిబంధనల గురించి ఓ సారి తెలుసుకుందాం.
సీఐఎస్‌కు సంబంధించిన సవరించిన ఫార్మాట్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పాలసీకి సంబంధించిన అన్ని సంబంధిత సమాచారాన్ని కలిగి ఉన్న సంక్షిప్త, నవీకరించిన సీఐఎస్‌ను బీమా సంస్థలు పంపాలని రెగ్యులేటర్ నిర్దేశించారు. వాస్తవానికి బీమాదారు, పాలసీదారుల మధ్య సమాచారానికి సంబంధించిన అసమానతకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. పాలసీదారుల అవగాహనను పెంపొందించడం, పారదర్శకతను పెంపొందించడం కోసం తాజా నియమాలను రూపొందించారు. బీమా ఉత్పత్తి పేరు, పాలసీ నంబర్, బీమా ఉత్పత్తి రకం, బీమా మొత్తం, పాలసీ కవరేజీ, మినహాయింపులు, నిరీక్షణ కాలం, కవరేజీ ఆర్థిక పరిమితులు, క్లెయిమ్‌ల విధానం, పాలసీ సర్వీసింగ్, వంటి వివరాలను ముందే నిర్వచించిన ఫార్మాట్‌లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ కలిగి ఉంటుంది. బీమాదారులు సీఐఎస్‌కు సంబంధించిన వివరాలను గమనించి, అందుకున్నారని నిర్ధారిస్తూ పాలసీదారుల రసీదుని కూడా తీసుకోవాలి.
ఆరోగ్య భీమా
ఆరోగ్య బీమాలోని సీఐఎస్ పాలసీదారులకు వారి ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని సరళమైన భాషలో అందించడానికి రూపొందించారు. ఇందులో పేరు, పాలసీ రకం, కవరేజ్ వివరాలు, వెయిటింగ్ పీరియడ్స్, పరిమితులు, ఉప పరిమితులు, అన్ని మినహాయింపులు, ఫ్రీ లుక్ క్యాన్సిలేషన్, మైగ్రేషన్, పోర్టబిలిటీ, మారటోరియం పీరియడ్ వంటి కాన్సెప్ట్‌లు, క్లెయిమ్‌ల సమర్పణ ప్రక్రియపై మార్గదర్శకత్వం, ఫిర్యాదు/ఫిర్యాదు దాఖలు కోసం సంప్రదింపు వివరాలు/ వెబ్ లింక్‌ల వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ చర్య వల్ల పాలసీదారులకు మెరుగైన సమాచారం, వివాదాలు, జాప్యాలు తగ్గుతాయి. అలాగే పాలసీదారులకు అతుకులు లేని ఆరోగ్య బీమా అనుభవం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పాలసీదారులు తమ ఆరోగ్యానికి సంబంధించిన సంబంధిత మెటీరియల్ సమాచారాన్ని పారదర్శకంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బహిర్గతం చేయకపోవడం క్లెయిమ్ సెటిల్‌మెంట్‌పై ప్రభావం చూపుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..