NRI Policies: ఎన్‌ఆర్‌ఐలకు కూడా భారతీయ జీవిత బీమా పాలసీలు.. కొనుగోలు సమయంలో ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
భారతదేశంలో జీవిత బీమా అంటే ఎల్‌ఐసీ పథకం అనే స్థితికి వచ్చింది. ఎల్‌ఐసీ ఇచ్చే బీమా ప్రయోజనాలు వేరే ఏ కంపెనీలు ఇవ్వవు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పథకాలకు డిమాండ్ ఏర్పడింది. జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి సాధారణంగా భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ప్రవాస భారతీయులకు భారతదేశంలో కొన్ని ప్రత్యేక జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. అయితే ఈ బీమా ప్లాన్ కొనుగోలు చాలా కష్టమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

జీవిత బీమా పాలసీలు అంటే మనం అనుకోని సందర్భంగా మన కుటుంబానికి దూరమైనప్పుడు ఆర్థికపరంగా రక్షణగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో జీవితా బీమా పాలసీలను చెల్లించడం అనేది పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. అయితే భారతదేశంలో వివిధ కంపెనీలు జీవిత బీమా పాలసీలు అందిస్తున్నాయి. ఎన్ని కంపెనీలున్నా భారతదేశంలో జీవిత బీమా అంటే ఎల్‌ఐసీ పథకం అనే స్థితికి వచ్చింది. ఎల్‌ఐసీ ఇచ్చే బీమా ప్రయోజనాలు వేరే ఏ కంపెనీలు ఇవ్వవు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పథకాలకు డిమాండ్ ఏర్పడింది. జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి సాధారణంగా భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ప్రవాస భారతీయులకు భారతదేశంలో కొన్ని ప్రత్యేక జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. అయితే ఈ బీమా ప్లాన్ కొనుగోలు చాలా కష్టమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎన్‌ఆర్‌ఐలు హ్యాపీగా జీవిత బీమా పాలసీలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు జీవితబీమాల పాలసీలు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
భారతీయ బీమా సంస్థలు ఏదైనా గ్లోబల్ లోకేషన్‌లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక బీమా పథకాలను అందిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, భారతీయ మూలాల ప్రజలు వారి కుటుంబ అవసరాలను తీర్చడానికి బీమా పథకాలు పొందేందుకు అవకాశం ఇస్తుంది. ఫెమా చట్టం ప్రకారం భారతీయ జీవిత బీమా కంపెనీల్లో బీమా పొందిన వ్యక్తులు భారతదేశంలో నివసించాల్సిన అవసరం ఉండదు. ఎన్‌ఆర్‌ఐల కోసం భారతీయ జీవిత బీమా కంపెనీలు ఆన్‌లైన్ ద్వారా బీమా పథకాలను పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఆన్‌లైన్ పథకాల వల్ల పాలసీ ఫీచర్లతో పాటు ప్రీమియం రేట్లు ఇతర కంపెనీలతో బేరీజు వేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఎన్‌ఆర్‌ఐ జీవిత బీమా పొందాలంటే వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్యుమెంట్లు బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది.
ప్రీమియం రేట్లు
భారతదేశంలోని బీమా సంస్థల ద్వారా బీమా పొందిన ఎన్‌ఆర్‌ఐకు ప్రీమియం రేట్లు వారు నివసించే దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే పాలసీదారులు అధిక రిస్క్ ఉన్న నివసిస్తుంటే ప్రీమియం రేట్లు భారీగా ఉంటాయి. ఒక్కోసారి నివసించే దేశాన్ని బట్టి బీమా సంస్థలు పాలసీను కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది. తక్కువ రిస్క్ ఉండే దేశాల్లో నివసించే ఎన్‌ఆర్‌ఐలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలసీను పొందవచ్చు. ప్రమాదకర దేశాలు నిత్యం రాజకీయ అస్థిరతతో ఉంటాయి. అందువల్ల నివాసితులను ప్రభావితం చేసేలా పౌర సంఘర్షణలతో పాటు హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది.
పరిశీలించాల్సిన అంశాలు
ఎన్‌ఆర్‌ఐలు భారతీయ బీమా సంస్థల్లో పాలసీను తీసుకుంటే కొన్ని మినహాయింపులను పరిశీలించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా పన్ను మినహాయింపులను సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీమా మెచ్యూర్ అయ్యాక పన్ను మినహాయింపుల కారణంగా గణనీయమైన రాబడిని పొందవచ్చు. అయితే ఈ పన్ను మినహాయింపులు వాళ్లు నివసించే దేశానికి అనుగుణంగా ఉంటుంది. ప్రీమియం చెల్లింపులను ఖాతాదారులు విదేశీ కరెన్సీలో లేదా నాన్ రెసిడెంట్ ఆర్డనీరి ఖాతా (ఎన్‌ఆర్‌ఓ), నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నెల్(ఎన్‌ఆర్‌ఈ), ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ ( ఎఫ్‌సీఎన్‌ఆర్) ఖాతాలతో సహా వివిధ భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారా చేయవచ్చు. ముఖ్యంగా పాలసీ డాక్యుమెంట్లు మనం ప్రీమియాన్ని ఎలా చెల్లించాలో? నిర్ధారిస్తాయి. బీమా పాలసీ విదేశీ కరెన్సీలో నిర్ణయిస్తే ఎన్‌ఆర్‌ఈ లేదా ఎఫ్‌సీఎన్‌ఆర్ ఖాతా ద్వారా అదే కరెన్సీలో సెటిల్ చేయాలి. పాలసీ అనేది ఇండియన్ కరెన్సీ ద్వారా నిర్ణయిస్తే ప్రీమియంలు ఎన్‌ఆర్‌ఓ ఖాతా ద్వారా సేకరిస్తారు. అలాగే డెత్ క్లెయిమ్ చేయాలంటే నామినీ పాలసీ డాక్యుమెంట్‌లో నిర్దేశించిన తుది మెచ్యూరిటీలకు సంబంధించి అవి పేర్కొన్న కరెన్సీలో అందిస్తారు. డెత్ క్లెయిమ్‌కు సంబంధించి పేర్కొన్న అన్ని వివరాలను నామినీ అందించాలి. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐ మరణించిన దేశంలోని భారత రాయబారి కార్యాలయం ధ్రువీకరించిన మరణ ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







