వరుసగా రెండో రోజు.. భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మహిళలకు షాక్ న్యూస్.. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర సుమారు రూ. 1200 మేర పెరిగింది. ఇక నిన్నటితో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ. 220 పెరిగి.. రూ. 58 వేల మార్క్ దాటింది. మరి మంగళవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు..
మహిళలకు షాక్ న్యూస్.. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర సుమారు రూ. 1200 మేర పెరిగింది. ఇక నిన్నటితో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ. 220 పెరిగి.. రూ. 58 వేల మార్క్ దాటింది. మరి మంగళవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 53,350గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి.. రూ. 58,200కి చేరింది. ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్ విషయానికొస్తే.. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 350గా ఉంది. బిజినెస్ క్యాపిటల్ ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58, 200గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53,650గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,530గా ఉంది. బెంగళూరులో అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,500.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200గా నమోదైంది.
బంగారం బాటలో వెండి..
బంగారం ధరలతో పాటుగానే వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. రూ. 500 పెరిగి రూ. 72,600కి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 75,500కు చేరుకోగా.. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది. అటు కోల్‌కతా, ముంబైలలో కూడా కిలో వెండి ధర రూ. 72,600గానే ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69 వేలు ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500గా ఉంది.
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయిల్-హమాస్ యుద్ద ప్రభావం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించిందనే చెప్పాలి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483.24 పాయింట్ల నష్టంతో 65512 పాయింట్ల వద్ద, నిఫ్టీ 156.70 పాయింట్ల నష్టంతో 19496.80 పాయింట్ల వద్ద ముగిసాయి. అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన షేర్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో.?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..