Congestion Tax: పన్ను పడుద్ది! ఆ సిటీలో కొత్తగా రద్దీ ట్యాక్స్.. ట్రాఫిక్ సమయంలో అటు వెళ్లాలంటే తప్పదు మరీ..
ట్రాఫిక్ రద్దీ పన్ను(కంజెషన్ ట్యాక్స్) అంటే అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేస్తున్న విధానం. మీరు మీ కారులో ఒక నిర్ణీత జంక్షన్‌లోకి ప్రవేశించాలనుకుంటే ముందుగా ఈ రద్దీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేకుంటే మీకు ఆ జంక్షన్‌లోకి ఎంట్రీ ఉండదు. ఈ విధానం కొత్తదేం కాదు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ దేశాలైన లండన్, సింగపూర్‌లలో అమలులో ఉన్నదే.

మన దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న మేజర్ సమస్య ట్రాఫిక్. వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరగడంతో నగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోతోంది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి. దీంతో ప్రజల సమయం వృథా అవడంతో పాటు వాతావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ సిగ్నల్ పడితే కనీసం 10నిమిషాలకు పైగానే వాహనాలు బారులు తీరే పరిస్థితి కొన్ని జంక‌్షన్లలో ఉంది. ఇది రోజురోజుకీ అధికమవుతోండటంతో దీనిని తగ్గించేందుకు బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ పన్ను(కంజెషన్ ట్యాక్స్)ను ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వంతో కలిసి నిపుణుల బృందం ప్రతిపాదించింది. రద్దీ సమయాల్లో బెంగళూరు నగరంలోని ప్రధాన జంక‌్షన్లు, అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించే వాహనాలపై ఈ రద్దీ చార్జీలు విధించే పథకాన్ని రూపొందించారు.
కంజెషన్ ట్యాక్స్ అంటే..
ట్రాఫిక్ రద్దీ పన్ను(కంజెషన్ ట్యాక్స్) అంటే అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేస్తున్న విధానం. మీరు మీ కారులో ఒక నిర్ణీత జంక్షన్‌లోకి ప్రవేశించాలనుకుంటే ముందుగా ఈ రద్దీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేకుంటే మీకు ఆ జంక్షన్‌లోకి ఎంట్రీ ఉండదు. ఈ విధానం కొత్తదేం కాదు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ దేశాలైన లండన్, సింగపూర్‌లలో అమలులో ఉన్నదే. బెంగళూరులో 2021 నుంచే ప్రయోగాత్మకంగా పలు చోట్ల అమలు చేస్తున్నారు కూడా.
పన్ను ఎలా వసూలు చేస్తారు..
ఈ కంజెషన్ ట్యాక్స్‌ని ప్రస్తుతం హైవే టోల్ ప్లాజాల వద్ద అమలు చేస్తున్న ఫాస్టాగ్ విధానంలోనే తీసుకుంటారు. ఏదైనా అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లోకి వెళ్లే ఎంట్రీ పాయింట్ వద్ద దీనిని ఏర్పాటు చేస్తారు. వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి డైరెక్ట్ గా పన్ను చెల్లించే విధంగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) చర్యలు తీసుకుంది.
ప్రయోజనం ఏమిటి?
రద్దీ ప్రాంతాల్లో రాకపోకలకు ట్యాక్స్ వసూలు చేయడం వల్ల ఆ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే ప్రజలు ఆలోచిస్తారు. అత్యవసరం అయితే తప్ప అటువైపు రారు. దీంతో ట్రాఫిక్ తగ్గుతుంది. అలాగే ట్యాక్స్ భారం భరించలేని వారు ప్రైవేటు వాహనాలను విడిచి పెట్టి, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అంటే ఆర్టీసీ, లోకల్ ట్రైన్, మెట్రో వంటి సాధనాలను వినియోగిస్తారు. దీంతో రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గడంతో పాటు కాలుష్యాన్ని పెంచే కార్బన ఉద్ఘారాలు కూడా అదుపులోకి వస్తాయి.
బెంగళూరులో ఎక్కడ..
బెంగళూరు లో ప్రతి రోజు కోటి 20 లక్షల వాహనాలు ప్రవేశిస్తాయి. దీని కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతూ ఉంటుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో నగరంలోని అత్యంత రద్దీగా ఉండే తొమ్మిది ముఖ్యమైన రోడ్లపై ఈ కంజెషన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్, హోసూర్ రోడ్డు, ఎయిర్ పోర్టు రోడ్డు, ఓల్డ్ మద్రాస్ రోడ్డు, బళ్లారి రోడ్డు, బన్నెరఘట్ట రోడ్డు, కనకపుర రోడ్డు, మాగాడి రోడ్డు, వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్డు, తుమకూరు రోడ్లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








