01 April 2025
Subhash
భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లో మోస్ట్ పాపులర్ బైక్‌గా రాయల్ ఎన్ఫీల్డ్కు (Royal Enfield) పేరుంది. కంపెనీ కూడా నేటి యువత అభిరుచులకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బైక్ అమ్మకాల డేటా వచ్చేసింది. గత నెలలో కంపెనీ బైక్‌లుఅమ్మకాలలో రికార్డు సృష్టించినట్లు డేటా నివేదికలు చెబుతున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చాలా మోడళ్లు ఉన్నాయి. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో ఎంత మైలేజీ ఇస్తుందో ఎప్పుడైనా గమనించారా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ మైలేజీ లీటర్ పెట్రోల్‌కు 41.55 కీ.మీ మైలేజీ ఇస్తుంది. కానీ తక్కువ మైలేజీ ఇచ్చినా ఈ బైక్‌ను ఇష్ట పడేవారు ఎంతో మంది ఉంటారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మైలేజ్‌పై ప్రభావం చూపే అంశాలు చాలా ఉంటాయి. రోడ్డు సరిగ్గా లేకపోవడం, రైడింగ్ చూసే విధానం, బైక్ నిర్వహణపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి.
బైక్ రైడింగ్ విధానం కారణంగా కూడా మైలేజీ తక్కువగా ఇవ్వవచ్చు. సాధారణ వేగం, సరైన గేర్ ఫిఫ్టింగ్ ద్వారా మైలేజీని పెంచవచ్చు. ఎక్కువ వేగంతో వెళ్లినా మైలేజీ ఇవ్వదు.
క్రమం తప్పకుండా బైక్ సర్వీసింగ్ చేయడం, టైర్‌లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వల్ల మైలేజీ సరిగ్గా ఇస్తుంది. లేకుంటే ఇలాంటి వల్ల మైలేజీపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోండి.
దేశీయ మార్కెట్లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.