E-Scooter: ఐఫోన్ కంటే చౌకైన ధరలో ఈ-స్కూటర్.. రయ్ రయ్ మంటూ 90కి.మీ దూసుకుపోవచ్చు..
ఈ రోజుల్లో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు..

పెట్రోల్ ధరల బాధ నుంచి విముక్తి పొందేందుకో.. లేక ఫ్యూయల్ వాహనాలకు ప్రత్యామ్నాయానికో తెలియదు గానీ.. చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ రోజుల్లో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్లతో, అదిరిపోయే లుక్, డిజైన్లతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
అద్భుతమైన బ్యాటరీ సపోర్ట్, ఒక్క చార్జ్‌తో 90 కిమీ రైడ్ ఆస్వాదించాలని అనుకున్నవారికి ఈ ePluto 7G Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్తమమైన ఆప్షన్. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చేసిన ఈ స్కూటర్ డెలివరీలో మే చివర్లో ప్రారంభం కానున్నాయి. ఈ వాహనంలో 3.0 KWH బ్యాటరీతో, 1.5KW మోటార్ సపోర్ట్‌తో శక్తి ఉత్పత్తి అవుతోంది. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఈ స్కూటర్ మాట్ బ్లాక్, గ్రే, వైట్ లాంటి వివిధ రంగులలో లభిస్తోంది. డ్రమ్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తోన్న ఈ వాహనం మీకు సౌకర్యవంతమైన రైడ్ అందిస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఐఫోన్ కంటే చౌక. ఈ స్కూటర్ రూ. 70 వేల నుంచి రూ. 90 వేల మధ్య దొరుకుతోంది. ఈ వాహనం గురించి పూర్తి సమాచారం కావాలంటే.. PURE EV అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.