AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. రూ. 15,000 వరకు పొందే అవకాశం!

కొత్తగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించే యువతకు ఆర్థిక ఊతాన్ని అందించడంతో పాటు నిరుద్యోగాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఒక సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోకి వచ్చే గుర్తింపు పొందిన సంస్థల్లో మొదటిసారిగా చేరే ఉద్యోగులకు ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద గరిష్టంగా రూ.15,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. రూ. 15,000 వరకు పొందే అవకాశం!
PM Viksit Bharat Rozgar Yojana
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2026 | 4:15 PM

Share

ఈపీఎఫ్‌ఓ (EPFO) పరిధిలోకి వచ్చే సంస్థలలో మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద రూ. 15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. కొత్త ఉద్యోగులలో పొదుపు, ఆర్థిక క్రమశిక్షణను పెంచడంతో పాటు ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ముఖ్య ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..

ఈ పథకం ద్వారా ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి మొదటి సంవత్సరం వేతనంలో కొంత భాగం ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. ఇది కొత్త ఉద్యోగులకు ఆర్థికంగా చేయూత ఇవ్వడమే కాకుండా, వారిలో పొదుపు అలవాటును పెంపొందించడానికి, భవిష్య నిధి (EPF) ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.

అర్హత ప్రమాణాలు:

మొదటిసారి ఉద్యోగులు: ఈపీఎఫ్‌ఓ కింద నమోదు చేసుకున్న ఏదేని సంస్థలో జీవితంలో మొదటిసారిగా రిజిస్టర్ అయిన ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

వేతన పరిమితి: ఉద్యోగి గ్రాస్ నెలకు రూ.1,00,000 (లక్ష రూపాయిలు) దాటకూడదు.

UAN, ఆధార్ సీడింగ్: ఉద్యోగి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ పూర్తయి ఉండాలి.

చెల్లింపు నిబంధనలు:

ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం, ఈ రూ.15,000 ప్రోత్సాహక సొమ్మును ఒకేసారి కాకుండా మూడు విడతల్లో లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ నిధులు నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా జమ చేయబడతాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరుతుంది.

కార్పొరేట్ రంగంలో లేదా ఈపీఎఫ్‌ఓ వర్తించే సంస్థలలో కొత్తగా కెరీర్ ప్రారంభించిన యువతకు ఈ పథకం ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. అర్హత కలిగిన కొత్త ఉద్యోగులందరూ తమ యుఏఎన్ (UAN), బ్యాంక్ వివరాలను ఆధార్‌తో అనుసంధానించుకుని ఈ ఆర్థిక ప్రయోజనాన్ని సులభంగా పొందే వీలుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పర్యాటకుడి కెమెరాకు చిక్కిన అరుదైన వన్యప్రాణి..
పర్యాటకుడి కెమెరాకు చిక్కిన అరుదైన వన్యప్రాణి..
'రణబాలి' చూసిన రామ్‌గోపాల్ వర్మ.. విజయ్ గురించి ఏమన్నారంటే?
'రణబాలి' చూసిన రామ్‌గోపాల్ వర్మ.. విజయ్ గురించి ఏమన్నారంటే?
మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. రూ. 15,000లు
మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. రూ. 15,000లు
వర్సిటీల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్‌
వర్సిటీల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్‌
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఈ సామెత అర్థం తెలుసా?
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఈ సామెత అర్థం తెలుసా?
హైదరాబాద్‌లో స్పీడ్ ఫ్రెండింగ్ ట్రెండ్‌.. జస్ట్ 5 నిమిషాల్లో..
హైదరాబాద్‌లో స్పీడ్ ఫ్రెండింగ్ ట్రెండ్‌.. జస్ట్ 5 నిమిషాల్లో..
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
డిగ్రీతో APPSC గ్రూప్‌ 1 ఉద్యోగాలు.. సిలబస్‌, ఎంపిక విధానం ఇదే!
డిగ్రీతో APPSC గ్రూప్‌ 1 ఉద్యోగాలు.. సిలబస్‌, ఎంపిక విధానం ఇదే!
నీరసంతోపాటు రక్తం తక్కువగా ఉన్నవారు మటన్‌లోని ఈ పార్ట్ తినండి
నీరసంతోపాటు రక్తం తక్కువగా ఉన్నవారు మటన్‌లోని ఈ పార్ట్ తినండి
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే