అద్బుత కట్టడాలు.. మైమరిపించే అందాలు.. ప్రపంచంలో టాప్ బెస్ట్ సిటీలు ఇవే..

Venkatrao Lella

Images: Pinterest

18 OCT 2026

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నగరాలు చాలా ఉండగా.. వీటిల్లో బెస్ట్ సిటీలు కొన్నే ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఆకర్షించడంతో పాటు మోడర్న్ లైఫ్‌స్ట్రైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. 7 బెస్ట్ సిటీలు ఏవో చూద్దాం.

ప్రపంచంలోనే ఇంగ్లండ్‌లోని లండన్ నగరం బెస్ట్ సిటీగా చెప్పవచ్చు. చారిత్రక కట్టడాలతో పాటు మెడర్న్ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉంటుంది. ఉట్టిపడే అందాలతో పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది.

రెండో స్థానంలో పారిస్ ఉంది. ఇది రోమాంటిక్ క్యాపిటల్‌గా చెప్పవచ్చు. అందమైన వాతావరణం, అద్బుత కట్టడాలు టూరిస్టులను మైమరిపించేలా చేస్తున్నాయి. 2013లో ఏకంగా 44 మిలియిన్ల మంది సందర్శించారు.

ప్రపంచంలో బెస్ట్ సిటీలలో అమెరికాలోని న్యూయార్క్ కూడా ఉంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వంటివి పాపులర్ అయ్యాయి. అన్ని దేశాల నుంచి టూరిస్టులు వీటిని చూసేందుకు వెళ్తుంటారు.

ఇక నాలుగో స్థానంలో జపాన్‌లోని టోక్యో ఉంది. అద్బుత కట్టడాలెన్నో ఇక్కడ ఉంటాయి. 2030 నాటికి 136 బిలియన్ల డాలర్లు టూరిజం ద్వారా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వరల్డ్‌లో అద్బుత నగరాల్లో సింగపూర్ ఐదో స్థానంలో నిలిచింది. మెరీనా బే సాండ్స్, మెరీనా బే వంటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి అందాలు టూరిస్టులను కట్టి పడేస్తున్నాయి.

ఆ తర్వాత దుబాయ్ ఆరో స్థానంలో ఉంది. అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా ఇక్కడ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా చెప్పవచ్చు. లగ్జరీ లైఫ్‌స్ట్రైల్ ఇక్కడ ఉంటుంది.

శాన్ ఫ్రాన్సిస్కో ఏడో స్థానంలో ఉంది. ఒరాకిల్ పార్క్, అల్కాట్రాజ్ ఐలాండ్, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వంటివి ఇక్కడ ఉన్నాయి. అందమైన ప్రదేశాలు ఈ నగరంలో ఉన్నాయి

ప్రముఖ సంస్థ 'అఫార్ మీడియా' ప్రపంచంలోని టాప్ బెస్ట్ 7 సిటీల జాబితాను విడుదల చేసింది. వాటిల్లో ఈ నగరాలు చోటు సంపాదించుకున్నాయి.