AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్, కొలెస్ట్రాల్ రెండింటినీ అదుపులో ఉంచుతుందా? ఉల్లిపాయ రహస్యం ఇదే!

ఉల్లిపాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే, ఇందులో ఉండే అల్లైల్ ప్రొపైల్ అనే మూలకం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తర్వాత కొద్దిగా ఉల్లిపాయ రసం తాగుతుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

షుగర్, కొలెస్ట్రాల్ రెండింటినీ అదుపులో ఉంచుతుందా? ఉల్లిపాయ రహస్యం ఇదే!
Onion Juice For Diabetes And Cholesterol
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2026 | 7:15 AM

Share

నేటి కాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే మన ఇంట్లోని వంటగదిలో సులభంగా లభించే చిన్న ఉల్లిపాయతో ఈ దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని మీకు తెలుసా? ఉల్లిపాయ కేవలం వంటకు రుచిని అందించడమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యలను నివారించే గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉల్లిపాయ:

ఉల్లిపాయ రసం రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన గుణం కలిగి ఉంది. ముఖ్యంగా చిన్న ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధీకకరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పరిశోధనల ప్రకారం, క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని తీసుకునేవారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుందని నిరూపితమైంది.

మధుమేహాన్ని నియంత్రించే గుణం:

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. రాత్రి సమయాలలో నియంత్రణకు రానంతగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ఈ పరిస్థితిలో ఉల్లిపాయ రసంలో ఉండే అల్లైల్‌ ప్రొపైల్ అనే ప్రత్యేక గుణం శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

ఉల్లిపాయలో ఉండే ప్రీబయోటిక్ గుణాలు ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పోషకాలు సరిగ్గా శోషించుకునేలా సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడం ద్వారా మెటబాలిజం మెరుగై, శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకుపోతాయి. అలాగే, ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఉల్లిపాయ రసం తయారు చేసుకునే విధానం:

5 నుండి 6 చిన్న ఉల్లిపాయలు లేదా రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని తొక్క తొలగించాలి. దీన్ని మిక్సీ జార్‌లో వేసి, చిటికెడు జీలకర్ర, 2 మిరియాలు, చిటికెడు పింక్ సాల్ట్, 4 పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రాండ్‌ చేసుకోవాలి. ఇందులో గ్లాసు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడకట్టి ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తర్వాత సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉల్లిపాయను కేవలం రసంగానే కాకుండా, ప్రతిరోజూ కొద్ది మొత్తంలో పచ్చి ఉల్లిపాయగా తిన్నా కూడా మీకు ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ సులభమైన పద్ధతిని పాటించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..
ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..
OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు
OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..
'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో