AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపులో మంట, ఎసిడిటీ ఇబ్బంది పెడుతున్నాయా? జీర్ణక్రియను మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు!

నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి ముఖ్యమైనవి. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అధికంగా కారం, నూనె పదార్థాలు తినడం, వేళపాళ లేని నిద్ర, మానసిక ఒత్తిడి వల్ల కడుపులో పిత్త దోషం పెరిగి కడుపు వేడి లేదా మంట ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిత్రకూట ఆయుర్వేద కేంద్రానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజేష్ భయారీ అందించిన 5 సులువైన ఆయుర్వేద చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

కడుపులో మంట, ఎసిడిటీ ఇబ్బంది పెడుతున్నాయా? జీర్ణక్రియను మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు!
Heartburn Relief
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2026 | 3:22 PM

Share

క్రమరహిత ఆహారపు అలవాట్లు, అధిక కారం, జిడ్డు పదార్థాలు తినడం, మానసిక ఒత్తిడి వల్ల కడుపులో మంట, పిత్త దోషం పెరిగి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు సిచిత్రకూట ఆయుర్వేద కేంద్ర నిపుణులు డాక్టర్ రాజేష్ భయారీ కొన్ని ఉపయోగకరమైన సూచనలు చేశారు. పిత్త దోషం సమతుల్యమై కడుపు మంట, ఎసిడిటీ పూర్తిగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

మితిమీరిన ఆహారానికి స్వస్తి – తక్కువ మోతాదులో తినండి:

ఒకేసారి కడుపు నిండా ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనికి బదులుగా, రోజులో కొద్ది కొద్ది మోతాదులో మీ శరీర అవసరానికి తగినంత ఆహారం తీసుకోవడం మంచిది.

కారం, వేపుళ్లను తగ్గించండి:

అధిక కారం, నూనెలో వేయించిన పదార్థాలు, కొవ్వు ఎక్కువ ఉండే ఆహారాలు కడుపులోని ప్రేగులపై ప్రభావం చూపి ఎసిడిటీని, గుండెల్లో మంటను కలిగిస్తాయి. ఇటువంటి ఆహారాన్ని పరిమితం చేయడం వల్ల కడుపులో మంట త్వరగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చలువ చేసే ఆహారాలు – సొరకాయ, పెసరపప్పు:

ఆయుర్వేదం ప్రకారం, చలువ చేసే గుణం కలిగిన సొరకాయ, త్వరగా జీర్ణమయ్యే పెసరపప్పును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన నీటిశాతం, పీచు పదార్థాలను అందించి కడుపును ప్రశాంతంగా ఉంచుతాయి.

సోంపు లేదా ధనియాల నీరు:

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. తగినంత నీటితో పాటుగా సోంపు లేదా ధనియాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అయితే ఇవి ఉపశమనం మాత్రమే ఇస్తాయి తప్ప పూర్తి వైద్యానికి ప్రత్యామ్నాయం కావని గుర్తుంచుకోవాలి.

రాత్రి భోజన సమయం, ఒత్తిడి నిర్వహణ:

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ పెరుగుతుంది. కాబట్టి, నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. అలాగే క్రమం తప్పని నిద్ర, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే పిత్త దోషగా సమతుల్యమవుతుంది. కడుపు మంట తీవ్రంగా లేదా దీర్ఘకాలంగా ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి సరైన సలహా పొందడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us