AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ టీ తాగితే చర్మం నల్లగా మారుతుందా? అసలు నిజం ఏమిటో తెలుసుకోండి!

మన దేశంలో ఉదయం లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ తాగడం చాలా మందికి అలవాటు. టీ ప్రియులు రోజుకు రెండు మూడు సార్లు కూడా టీ తాగుతుంటారు. అయితే, ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా టీ తాగితే ముఖం లేదా చర్మం రంగు నల్లగా మారుతుందని సమాజంలో ఒక బలమైన నమ్మకం లేదా అపోహ ప్రచారంలో ఉంది. అసలు ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉంది? వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Oct 19, 2026 | 2:22 PM

Share
చర్మం రంగు ఎందుకు మారుతుంది?: మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవుని చర్మం రంగు అనేది పూర్తిగా జన్యుపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం చర్మం రంగును నిర్ణయిస్తుంది. అంతేకాకుండా, సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాలు, కాలుష్యం, సరైన జీవనశైలి లేకపోవడం వంటి కారణాల వల్ల చర్మం కమిలిపోవచ్చో లేక నల్లగా మారవచ్చో కానీ, మనం తాగే టీ వల్ల చర్మం రంగు ఎప్పటికీ మారదు.

1 / 5
టీ తాగడం వల్ల చర్మానికి వచ్చే నష్టాలు ఏమిటి?: టీ నేరుగా చర్మం రంగును మార్చకపోయినా, దాని అధిక వినియోగం చర్యంపై పరోక్ష ప్రభావం చూపుతుంది. టీలో కెఫిన్ ఉంటుంది. దీనిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, చర్మం పొడిబారి కాంతిహీనంగా మారుతుంది.

2 / 5
 టీలో ఎక్కువ పాలు, పంచదార కలిపి తాగడం వల్ల చర్మంలో మంట, మొటిమలు, ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో టీ తాగడం వల్ల నిద్ర కరువై, కళ్ల కింద నల్లటి వలయాలు  ఏర్పడతాయి. దీనివల్ల చర్మం నల్లగా మారుతున్నట్లు భ్రమ కలుగుతుంది.

3 / 5
పరిమితంగా తాగితే ప్రయోజనమే: పాలు కలపకుండా గ్రీన్ టీ, బ్లాక్ టీ లేదా హెర్బల్ టీలను మితంగా తాగడం వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగదు. పైగా వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. టీ తాగడం వల్ల చర్మం రంగు నల్లగా మారుతుందనేది పూర్తిగా అబద్ధం.

4 / 5
అలాగే పాల టీలో కలిపే పంచదార చర్మానికి హాని చేయవచ్చు. మితంగా, ముఖ్యంగా గ్రీన్ టీ లేదా పాలు కలపని టీ తాగడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు రావు. కాబట్టి టీ వల్ల చర్మం నల్లబడుతుందనేది కేవలం అపోహ మాత్రమే. అయితే, ఆరోగ్యం, చర్మం అందంగా ఉండాలంటే టీ వినియోగాన్ని పరిమితం చేయడం, పంచదార వాడకం తగ్గించడం, తగినన్ని నీరు తాగడం ఎంతో ముఖ్యం.

5 / 5
Follow Us
ప్రతిరోజూ టీ తాగితే చర్మం నల్లగా మారుతుందా? అసలు నిజం ఏంటంటే

నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు పెట్టిన డస్ట్‌బిన్‌ను ఎత్తుకెళ్లారు..

థియేటర్లలో పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు బాగా ఇష్టం

IPL Trade: సీఎస్‌కే కాదు.. హార్దిక్ పాండ్యా చేరేది ఆ జట్టులోనా..?

AI సహాయంతో 5 ఏళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టొచ్చు

పోలవరం వద్ద గోదారమ్మకు సరికొత్త శోభ..!
పోలవరం వద్ద గోదారమ్మకు సరికొత్త శోభ..!
'జైలర్ 2' చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా?

ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ..