Summer Coolers: వేసవి వచ్చేస్తోంది.. అతి తక్కువ ధరల్లో ఎయిర్ కూలర్లు.. చల్లని గాలి కోసం బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Summer Coolers: ఇది పోర్టబుల్ డెజర్ట్ ఎయిర్ కూలర్. అయితే ధర తక్కువగా ఉందని వెంటనే కొనుగోలు చేయకుండా, కొనుగోలుదారుల రివ్యూలు, ట్యాంక్ సామర్థ్యం, గాలి సామర్థ్యం, సర్వీస్ సదుపాయాలు వంటి వివరాలను పరిశీలించడం మంచిది. చాలా తక్కువ ధరలో కూలింగ్..

Summer Coolers: వేసవి కాలం సమీపిస్తోంది. ఎండల తీవ్రత పెరిగేలోపు ఇంటికి తక్కువ ధరలో ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్ కూలర్లపై ఓ లుక్కేయండి. రూ.5 వేల లోపే కొన్ని మోడళ్లు అందుబాటులో ఉండగా, మరికొన్ని కూలర్లు అంతకంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే ధరతోపాటు కూలింగ్ సామర్థ్యం, వాటర్ ట్యాంక్, గాలి విసిరే దూరం వంటి అంశాలను కూడా పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే ఏసీ ఒక్కటే మార్గం కాదు. తక్కువ బడ్జెట్‌లో ఉండేవారికి ఎయిర్ కూలర్లు కూడా ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం. ముఖ్యంగా చిన్న గదులు, అద్దె ఇళ్లు, వ్యక్తిగత వినియోగం కోసం కూలర్లు మంచి ఎంపికగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న రెండు బడ్జెట్ కూలర్ల వివరాలు తెలుసుకుందాం.

Air Cooler
1. Kenstar 45 లీటర్ల ఎయిర్ కూలర్.. రూ.4,999కే!
బడ్జెట్‌లో మంచి సామర్థ్యం ఉన్న కూలర్ కోసం చూస్తున్నవారు పరిశీలించదగిన మోడళ్లలో Kenstar TurboCool Neo 45 ఒకటి. అయితే ఆన్‌లైన్‌లో ఈ కూలర్ ధర రూ.11,990 ఉండగా, 58 శాతం తగ్గింపుతో పొందవచ్చు. ధర తగ్గిన తర్వాత రూ.4,999కే లభిస్తుంది.
- ఈ కూలర్ వాటర్ ట్యాంక్ సామర్థ్యం: 45 లీటర్లు
- కూలింగ్ ప్యాడ్స్: హనీకూంబ్ ప్యాడ్స్
- మోటార్, పంపుపై వారంటీ: 5 సంవత్సరాలు అని ఉత్పత్తి వారంటి ఉంటుంది.
45 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం ఉండటంతో, చిన్న ట్యాంక్ ఉన్న కూలర్లతో పోలిస్తే తరచుగా నీటిని నింపాల్సిన అవసరం తగ్గవచ్చు. అయితే నీటి వినియోగం, ఫ్యాన్ వేగం, వాతావరణ పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. హనీకూంబ్ కూలింగ్ ప్యాడ్స్‌తో గాలిని చల్లబరిచే ఈ మోడల్‌ను ఇంటి అవసరాలకు పరిశీలించవచ్చు. కొనుగోలు చేసే ముందు గది పరిమాణానికి తగిన గాలి ప్రవాహం అందిస్తుందో లేదో తెలుసుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో 45 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం ఉన్న కూలర్ కావాలనుకునేవారు ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు.
2. Drumstone ఎయిర్ కూలర్.. రూ.2,139కే!
ఇక Drumstone ఎయిర్ కూలర్ అసలు ధర 3,999 ఉండగా, 47 శాతం డిస్కౌంట్‌తో రూ.2,139కే లభిస్తుంది. ఇది పోర్టబుల్ డెజర్ట్ ఎయిర్ కూలర్. అయితే ధర తక్కువగా ఉందని వెంటనే కొనుగోలు చేయకుండా, కొనుగోలుదారుల రివ్యూలు, ట్యాంక్ సామర్థ్యం, గాలి సామర్థ్యం, సర్వీస్ సదుపాయాలు వంటి వివరాలను పరిశీలించడం మంచిది. చాలా తక్కువ ధరలో కూలింగ్ పరికరం కోసం చూస్తున్నవారు ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు. అయితే తక్కువ రేటింగ్‌ల నేపథ్యంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

Air Cooler
ఇది కూడా చదవండి: Bharat Train: వందే భారత్ రైలుకు స్టీరింగ్ ఉండదు.. అయినా మలుపుల్లో ఎలా తిరుగుతుంది?
ఇది కూడా చదవండి: Post Office: పోస్ట్ ఆఫీస్‌లో టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా? మీకు ఏది బెస్టో చూసుకోండి..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
