EPFO: పీఎఫ్‌ కస్టమర్లు ఈ పని పూర్తి చేశారా..? లేదంటే రూ.7 లక్షలు కోల్పోయినట్లే..

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కస్టమర్లకు రూ.7 లక్షల ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే దీని కోసం ఒక ముఖ్యమైన పని చేయాల్సి..

EPFO: పీఎఫ్‌ కస్టమర్లు ఈ పని పూర్తి చేశారా..? లేదంటే రూ.7 లక్షలు కోల్పోయినట్లే..
EPFO
Follow us

|

Updated on: Aug 16, 2022 | 5:01 PM

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కస్టమర్లకు రూ.7 లక్షల ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే దీని కోసం ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. అదే ఈ-నామినేషన్ దాఖలుకు సంబంధించినది. అంటే తన ఈపీఎఫ్ ఖాతాలో ఈ-నామినేషన్ ఫైల్ చేసిన కస్టమర్ రూ.7 లక్షల ప్రయోజనం పొందుతారు. ఈపీఎఫ్‌వో నోటీసులో ఈ సమాచారం ఇచ్చింది. ఈపీఎఫ్‌ కలిగివున్న ప్రతి ఒక్కరికి ఈ-నామినేషన్ తప్పనిసరి చేయబడింది. తద్వారా ఖాతాదారునికి ఏ విధమైన మరణం సంభవించినా ఆ సదుపాయాన్ని అతని నామినీ అందుకోవచ్చు. PFలో సామాజిక భద్రతకు సంబంధించిన ప్రయోజనం నామినీకి ఇవ్వబడుతుంది.

EPFO ఈ-నామినేషన్ సదుపాయం ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. ఈ-నామినేషన్ మొత్తం డిజిటల్‌గా ఉండాలి. అందుకే ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ద్వారా ఈ-నామినేషన్‌ ప్రక్రియను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు.

ఈ-నామినేషన్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

☛ ముందుగా మీరు epfindia.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

☛ ఇక్కడ సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి, ఉద్యోగుల ఎంపికపై క్లిక్ చేయండి.

☛ ఇప్పుడు మెంబర్ UAN / ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

☛ దీని తర్వాత ఈ-సేవా పోర్టల్‌కి వెళ్లి మీ మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.

☛ ఇక్కడ మీరు మేనేజర్ ట్యాబ్‌ కనిపిస్తుంది. అక్కడ మీరు YES ఎంపికను ఎంచుకుని, కుటుంబ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

☛ మీ కుటుంబ సమాచారం మొత్తాన్ని పూరించండి

☛ ఇప్పుడు నామినేషన్ వివరాలపై క్లిక్ చేసి, ఎవరెవరికి ఎంత షేర్‌ అనేది నమోదు చేయాలి.

☛ దీని తర్వాత ఈపీఎఫ్ నామినేషన్ వివరాలను సేవ్ చేసుకోవాలి.

☛ e-Sign ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.

☛ తర్వాత మీ ఈ-నామినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత వినియోగదారుని ఇ-నామినేషన్ పూర్తవుతుంది. ఒక సబ్‌స్క్రైబర్ ఇ-నామినేషన్ చేయకపోతే అతని నామినీ సామాజిక భద్రతకు సంబంధించిన ప్రయోజనాలను పొందడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొవచ్చు. ఇలా ఇబ్బందులు పడకుండా, ప్రయోజనం పొందేందుకు ఈ-నామినేషన్ తప్పనిసరి చేయబడింది. ఖాతాదారు చనిపోయినప్పుడు ఈ-నామినేషన్ ప్రయోజనం నామినీకి అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ-నామినేషన్ నమోదు చేసుకుంటే నామినీకి రూ.7 లక్షలు ఇస్తారు. కస్టమర్ తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాలి. కస్టమర్లు తమ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి ఇంట్లో కూర్చొని ఈ-నామినేషన్ ఫైల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో