MRP: ఎంఆర్పీ కంటే ఎక్కువ తీసుకుంటున్నారా?.. చీటర్స్‌కు ఇలా షాక్ ఇవ్వండి..
MRP కంటే ఎక్కువ వసూలు చేయడం నేరం.. ఇవ్వడం కూడా నేరమే. ఏ వస్తువు కోసం కస్టమర్ల నుంచి గరిష్ట రిటైల్ ధర కంటే ఎక్కువ డిమాండ్ చేయడం ఏ రిటైలర్ చేసే నేరంగా పరిగనిస్తారు
లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం ఏ దుకాణదారుడు ఏ వస్తువుకైనా MRP కంటే ఎక్కువ మొత్తాన్ని అడగకూడదు. కానీ తరచూ దుకాణదారులు చల్లని నీరు లేదా శీతల పానీయాలు ఇచ్చినందుకు ఎంఆర్‌పీకి అదనంగా కూలింగ్ చార్జీ పేరుతో రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. చాలా మంది ఇస్తే పోలా అని అనుకుంటారు. “దో రూపే కి హై బాత్ హై , దే దేతే నే…” అని అనుకుంటారు. కానీ ఇలా చేయడం ద్వారా వారు చట్టాన్ని ఉల్లంఘించడంలో కూడా సహాయపడుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది ?
సెంట్రల్ మెట్రాలజీ చట్టం ప్రకారం, శీతలీకరణ, రవాణా వంటి వాటి సాకుతో రిటైలర్ ఏదైనా వస్తువులపై MRP కంటే ఎక్కువ వసూలు చేస్తే.. అది చట్టరీత్యా నేరం. అంతే కాదు, అలాంటి వ్యాపారులపై రెండు వేల రూపాయల జరిమానా కూడా ఉంటుంది.
వాస్తవానికి, ప్రతి వస్తువుకు MRP నిర్ణయించబడినప్పుడు ఆ వస్తువు తయారీకి అయ్యే ఖర్చుతో పాటు దాని నిల్వ, రవాణా మొదలైనవాటికి అయ్యే ఖర్చు కూడా అంచనా వేయబడుతుంది. ఆ వస్తువు గరిష్ట చిల్లర ధర నిర్ణయించబడుతుంది. అందుకే ఏ చిల్లర అయినా ఎక్కువ డబ్బులు అడగడం తప్పు.
ఏదైనా రిటైలర్ లేదా దుకాణదారు మీ నుంచి MRP కంటే ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తే, వెంటనే నేషనల్ కస్టమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915కి కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయండి. మీరు కావాలంటే, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం