Indian Railways: ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. రైళ్లలో ఉండే గార్డు హోదా మార్పు.. ఎందుకంటే

Indian Railways: దేశంలో అతిపెద్ద వ్యవస్థలో రైల్వే శాఖ. ప్రతి రోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది రైల్వే. ఇక ప్రతి రైలులో గార్డు ఉంటాడన్న విషయం..

Indian Railways: ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. రైళ్లలో ఉండే గార్డు హోదా మార్పు.. ఎందుకంటే
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2022 | 5:16 PM

Indian Railways: దేశంలో అతిపెద్ద వ్యవస్థలో రైల్వే శాఖ. ప్రతి రోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది రైల్వే. ఇక ప్రతి రైలులో గార్డు ఉంటాడన్న విషయం అందరికి తెలిసిందే. అయితే రైలులో ఉండే గార్డు హోదాను మార్చాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. రైల్వే తన ఉద్యోగుల ఏళ్ల నాటి కలను నెరవేచ్చింది రైల్వే శాఖ. రైల్‌ గార్డు హోదాను మార్చింది. ఇప్పుడు రైలులో ఉండే గార్డులను రైలు మేనేజర్‌గా పిలుస్తారు. ఈ మేరకు అన్ని రైల్వేల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు లేఖ కూడా జారీ చేసింది.

ఈ నిర్ణయాన్ని రైల్వే శాఖ తక్షణం అమల్లోకి తీసుకువచ్చింది. ఉద్యోగుల ఈ డిమాండ్ ఈ ఏడాది జనవరిలో అంగీకరించబడింది. భారతీయ రైల్వే తన అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించిది. 2004 నుండి గార్డు హోదాను మార్చాలని ఉద్యోగుల నుండి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. కాపలాదారుడి ఉంటూ సిగ్నల్‌ కోసం జెండా చూపించడం, టార్చ్ చూపించడమే కాదని, దాని హోదాను మార్చాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు.

హోదా మారినా.. బాధ్యత మారలేదు:

ఇవి కూడా చదవండి

అయితే రైల్వే గార్డ్‌ల హోదాను మార్చినప్పటికీ, వారి బాధ్యతలు అలాగే ఉంటాయి. అందులే తేడా ఉండదు. రైళ్లలో ప్రయాణికుల అవసరాలను తీర్చడంతో పాటు, పార్శిల్ మెటీరియల్ అమలు, ప్రయాణికుల భద్రత, రైలు సంరక్షణ కూడా గార్డు బాధ్యతతో వస్తుంది. అటువంటి పరిస్థితిలో హోదాను మార్చాలనే డిమాండ్‌ను రైల్వే కూడా న్యాయబద్ధంగా అంగీకరించింది. హోదా మార్చడం వల్ల ఈ ఉద్యోగుల బాధ్యత మారదని రైల్వే అధికారులు తెలిపారు.

పాత హోదా – కొత్త హోదా జాబితా

☛ అసిస్టెంట్ గార్డ్ – అసిస్టెంట్ ప్యాసింజర్ రైలు మేనేజర్

☛ గూడ్స్ గార్డ్ – గూడ్స్ రైలు మేనేజర్

☛ సీనియర్ గూడ్స్ గార్డ్ – సీనియర్ గూడ్స్ రైలు మేనేజర్

☛ సీనియర్ ప్యాసింజర్ గార్డ్ – సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్

☛ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ గార్డ్ – మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?