7th Pay Commission: స్వాతంత్ర్యం దినోత్సవం వేళ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
7th Pay Commission: దేశం ఒకవైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు..
7th Pay Commission: దేశం ఒకవైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2022 నుండి అమలులోకి వచ్చే ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్ణయించారు. ఆరావళి జిల్లాలోని మోడసాలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9.38 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై రూ.1400 కోట్ల భారం పడనుంది.
గుజరాత్ కంటే ముందే త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.523.80 కోట్ల భారం పడనుంది. అలాగే ఈ నిర్ణయంతో మొత్తం 1,88,494 మంది లబ్ధి పొందనున్నారు. ఇందులో ప్రస్తుతం ఉన్న 1,04,683 మంది ఉద్యోగులతో పాటు 80,855 మంది పెన్షనర్లు ఉన్నారు. అంతకుముందు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 31 శాతం నుండి 34 శాతానికి పెంచింది. దీనివల్ల రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుండగా, రాష్ట్ర ఖజానాపై రూ.625 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే, రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి