75th Independence Day: హర్ ఘర్ తిరంగా ప్రచారం.. రూ. 500 కోట్ల వ్యాపారం..10 లక్షల మందికి ఉపాధి

75th Independence Day: దేశవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి స్వాతంత్ర్య దినోత్సవాన్ని కొత్త ఉత్సాహంతో జరుపుకున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం..

75th Independence Day: హర్ ఘర్ తిరంగా ప్రచారం.. రూ. 500 కోట్ల వ్యాపారం..10 లక్షల మందికి ఉపాధి
75th Independence Day
Follow us

|

Updated on: Aug 15, 2022 | 3:20 PM

75th Independence Day: దేశవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి స్వాతంత్ర్య దినోత్సవాన్ని కొత్త ఉత్సాహంతో జరుపుకున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హర్ ఘర్ తిరంగ అభియాన్‌ను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా 30 కోట్ల జాతీయ జెండాల విక్రయం జరిగి దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ చేసింది. దేశభక్తి, స్వయం ఉపాధికి సంబంధించిన ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజలలో అద్భుతమైన దేశభక్తి భావనను సృష్టించింది. ఈ సంవత్సరం ఆగస్టు 15, 2022 నుండి 15 ఆగస్టు 2023 వరకు స్వరాజ్య సంవత్సరంగా ప్రకటించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. CAIT జాతీయ అధ్యక్షుడు భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. గత 15 రోజులుగా పెద్ద సంఖ్యలో వ్యాపార సంస్థలు దేశవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ త్రివర్ణ కార్యక్రమాలను నిర్వహించాయని తెలిపారు.

20 రోజుల్లో 30 కోట్ల త్రివర్ణ పతాకాలను తయారు చేశామని, ‘హర్ ఘర్ త్రివర్ణ’ ఉద్యమం భారతీయ పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని కూడా చాటిచెప్పిందని వ్యాపారవేత్తలిద్దరూ తెలిపారు. దేశ ప్రజల 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంగరంగవైభవంగా జరుపుకునేందుకు సుమారు 20 రోజుల రికార్డు సమయంలో 30 కోట్లకు పైగా త్రివర్ణాలను తయారు చేశారు. CAT పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు అన్ని రాష్ట్రాల్లో ర్యాలీలు, కవాతులు, జ్యోతి ఊరేగింపులు, తిరంగా గౌరవ్ యాత్రలు, బహిరంగ సభలు, సమావేశాలతో సహా పెద్ద త్రివర్ణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా దేశభక్తిని ప్రేరేపించాయి.

10 లక్షల మందికి ఉపాధి:

ఇవి కూడా చదవండి

జెండాల తయారీకి పాలిస్టర్, మెషీన్లను అనుమతిస్తూ ఫ్లాగ్ కోడ్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు కూడా దేశవ్యాప్తంగా జెండాలు సులభంగా అందుబాటులోకి రావడానికి ఎంతగానో దోహదపడ్డాయని భారతియా, ఖండేల్వాల్ అన్నారు. ఇంతకుముందు భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఖాదీ లేదా వస్త్రంలో మాత్రమే తయారు చేయడానికి అనుమతి ఉండేది. దేశంలో పది లక్షల మందికి పైగా ఉపాధి కల్పించారు. వీరు తమ ఇళ్లలో లేదా చిన్న ప్రదేశాల్లో స్థానిక టైలర్ల సహాయంతో పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు.

చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు వాణిజ్య రంగం భారతీయ జెండాను తయారు చేయడంలో పగలు, రాత్రి పని చేసింది. అయితే ఈ జెండాలను రకరకాల సైజుల్లో తయారు అయ్యాయి. గత సంవత్సరాల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ త్రివర్ణ పతాకాల వార్షిక విక్రయాలు దాదాపు రూ.150-200 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా హర్ ఘర్ తిరంగా ఉద్యమం వల్ల అమ్మకాలు మానిఫోల్డ్ రూ.500 కోట్లకు పెరిగాయి.

20 రోజుల్లో..

గత 20 రోజులుగా త్రివర్ణ పతాకాల ప్రచారం పట్ల ప్రజల్లో ఉన్న ఉత్సాహం, దేశభక్తిని దృష్టిలో ఉంచుకుని భారతదేశ ప్రధాన కళ, వ్యాపారాన్ని మేల్కొల్పడానికి ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన సంస్థలతో కలిసి పనిచేయాలని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి