NPS Rules: జాతీయ పింఛ‌ను ప‌థ‌కంలో చందాదారుడు నామినీ నమోదు చేయకపోతే వారసులు డెత్ క్లెయిమ్‌ను ఎలా చేసుకోలంటే..

NPS పథకం పెట్టుబడిదారులకు.. తమ కెరీర్‌లో పదవీ విరమణ అనంతరం జీవించే విధంగా తగిన ఆర్ధిక భద్రతను ఇస్తుంది. పని చేస్తున్న సమయంలో తమ సంపాదనలో కొంత భాగాన్ని NPS పథకం ద్వారా పక్కన పెట్టవచ్చు.

NPS Rules: జాతీయ పింఛ‌ను ప‌థ‌కంలో చందాదారుడు నామినీ నమోదు చేయకపోతే వారసులు డెత్ క్లెయిమ్‌ను ఎలా చేసుకోలంటే..
National Pension System
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2022 | 11:56 AM

National Pension System: జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (NPS) పదవీ విరమణ పొదుపుని సులభతరం చేస్తుంది. భారతీయ పౌరులు పదవీ విరమణ తర్వాత వారికి తగిన ఆర్థిక భద్రతను ఇవ్వడానికి ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకాన్ని దీర్ఘకాలిక ఆర్థిక భద్రతా ప్రణాళికలో ఒక భాగంగా ఉపయోగించవచ్చు.

NPS పథకం పెట్టుబడిదారులకు.. తమ కెరీర్‌లో పదవీ విరమణ అనంతరం జీవించే విధంగా తగిన ఆర్ధిక భద్రతను ఇస్తుంది. పని చేస్తున్న సమయంలో తమ సంపాదనలో కొంత భాగాన్ని NPS పథకం ద్వారా పక్కన పెట్టవచ్చు. ఖాతాదారులు, మీ చట్టపరమైన వారసుడు పదవీ విరమణ తర్వాత సంవత్సరాల్లో సేకరించిన కార్పస్ మొత్తం నుండి ప్రయోజాలను పొందుతారు.

PFRDA (NPS కింద నిష్క్రమణలు & ఉపసంహరణలు) నిబంధనలు 2015, సవరణల ప్రకారం.. ఈ పథకంలో చేరిన చందాదారుడు మరణించిన సందర్భంలో.. అతనికి వచ్చే ఆర్జిత పెన్షన్ సంపద (100 శాతం NPS కార్పస్) నామినీలకు లేదా చట్టపరమైన వారసులకు వర్తించే విధంగా పంపిణీ చేయబడుతుంది. అయితే, ఎన్‌పిఎస్ ఖాతాదారుడు నామినీ పేరు జత చేయకుండా లేదా చెల్లని నామినీ పేరుని పెట్టి.. మరణిస్తే . అపుడు ఆ వినియోగదారుడి పెన్షన్ ను ఏమి చేస్తారంటే..

ఇవి కూడా చదవండి

చనిపోయిన చందాదారుడు మరణించే ముందు నామినీ పేరుని నమోదు చేయకపోతే..  సంబంధిత రాష్ట్ర రెవెన్యూ అధికారులు జారీ చేసిన చట్టపరమైన వారసుల ధృవీకరణ పత్రం లేదా కోర్టు జారీ చేసిన వారసత్వ ధృవీకరణ పత్రం ఉన్న కుటుంబ సభ్యులకు చందాదారుడు పెన్షన్ సంపద చెల్లిస్తారు. చట్టపరమైన వారసుడు లేదా నామినీ ఉన్న సందర్భాల్లో.. అటువంటి వారు చందాదారుల మరణ ధృవీకరణ పత్రం, KYC పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి సపోర్టింగ్ డాక్యుమెంటేషన్‌తో పాటు పూర్తిగా నింపిన మరణ ఉపసంహరణ ఫారమ్‌ను సమర్పించాలి. అప్పుడు చందాదారుడి జాతీయ పింఛ‌ను ప‌థ‌కం నుంచి డబ్బులను క్లెయిమ్ చేయవచ్చు.

మరణ ఉపసంహరణ ఫారమ్‌లో అవసరమైన అన్ని పత్రాల లిస్ట్ ఉంటుంది.

పెన్షన్ ను క్లెయిమ్ చేయడానికి.. మరణించిన చందాదారుని నామినీ లేదా చట్టపరమైన వారసుడు KYC డాక్యుమెంట్‌లు, సబ్‌స్క్రైబర్ డెత్ సర్టిఫికేట్ , బ్యాంక్ ఖాతా డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన డాక్యుమెంట్‌ల వంటి అనేక సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటు సరిగ్గా పూర్తి చేసిన డెత్ ఉపసంహరణ ఫారమ్‌ను కూడా తప్పనిసరిగా జత చేసి.. అప్పుడు చందాదారుని పెన్షన్ ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకరు కంటే ఎక్కువ మంది నామినీ పేర్లను చందాదారుడు నమోదు చేసినట్లు అయితే.. వారు తప్పనిసరిగా ఉపసంహరణ ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించాలి. అయితే ఒక నామినీ లేదా నామినీలు  ఈ పథక కార్పస్‌ను క్లెయిమ్ చేయకూడదనుకుంటే.. అటువంటి వారు.. రిలింక్విష్‌మెంట్ డీడ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. అదే సమయంలో  జాతీయ పెన్షన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేసే నామినీ తప్పనిసరిగా నష్టపరిహారం బాండ్‌ను సమర్పించాలి. ఒక నామినీ మేజర్ , మరొకరు మైనర్ అయితే ప్రధాన నామినీ వారి ఉపసంహరణ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. మైనర్ తరపున, ఉపసంహరణ ఫారమ్, మైనర్ జనన ధృవీకరణ పత్రాన్ని సంరక్షకుడు సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..