AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2022: భారత స్వాతంత్ర్యోద్యమం గురించి ఈ విషయాలు తెలుసా? ఓ సారి చెక్‌ చేసుకోండి..

భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి ఇక్కడ మీకోసం కొన్ని ప్రశ్నలను ఇస్తున్నాం. ఈ క్విజ్‌లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెట్ట్‌ అన్సర్‌ ఇస్తారో చూద్దాం.. ఆన్సర్ తెలియని ప్రశ్నలకు సమాధానాలు చివర్లో పొందుపరిచాం. ఇక ప్రారంభిద్దామా..

Independence Day 2022: భారత స్వాతంత్ర్యోద్యమం గురించి ఈ విషయాలు తెలుసా? ఓ సారి చెక్‌ చేసుకోండి..
Independence Day 2022
Srilakshmi C
|

Updated on: Aug 15, 2022 | 11:24 AM

Share

Independence Day Quiz 2022 in India: ఈ రోజు దేశవ్యాప్తంగా యావత్‌ భారతీయులు 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులకు నివాళులు అర్పించేందుకు ఈ రోజు (ఆగస్టు 15న) `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’ అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో తిరంగాను ప్రతి ఇంట్లో ఎగరేయాలని, ప్రజల్లో దేశభక్తిని నింపడానికి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్ధేశించి ప్రశంగం కూడా చేశారు. ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు 9 సార్లు ప్రధాని హోదాలో ‘తిరంగ’ను ఆవిష్కరించడం విశేషం. ప్రతీ ఏడాది ఈ రోజున రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కొత్తగా ఎన్నికైనా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి ఇక్కడ మీకోసం కొన్ని ప్రశ్నలను ఇస్తున్నాం. ఈ క్విజ్‌లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెట్ట్‌ అన్సర్‌ ఇస్తారో చూద్దాం.. ఆన్సర్ తెలియని ప్రశ్నలకు సమాధానాలు చివర్లో పొందుపరిచాం. ఇక ప్రారంభిద్దామా..

1. భారత జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు?

ఎ) పింగళి వెంకయ్య బి) గోపాల్ క్రిషన్ గోఖలే సి) దాదాభాయ్ నరోజీ డి) ఫిరోజ్‌షా మెహతా

ఇవి కూడా చదవండి

2. ‘సర్ఫరోషి కి తమన్నా’ అనే దేశభక్తి కవితను ఎవరు రాశారు?

సి) కర్తార్ సింగ్ సరభా బి) ముహమ్మద్ ఇక్బాల్ సి) బంకిం చంద్ర ఛటర్జీ డి) రామ్ ప్రసాద్ బిస్మిల్

3. ఏ ప్రణాళికను విభజన ప్రణాళిక అని పిలుస్తారు?

ఎ) మెకాలే ప్రణాళిక బి) అట్లీ ప్రకటన సి) మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు డి) మౌంట్ బాటన్ ప్రణాళిక

4. 1960లో భారతదేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు?

ఎ) వర్గీస్ కురీన్ బి) నార్మన్ బోర్లాగ్ సి) M.S. స్వామినాథన్ డి) వీరేంద్ర లాల్ చోప్రా

5. మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న ఎర్రకోటలో ఏ గేట్‌ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు?

ఎ) లాహోరీ గేట్ బి) ఢిల్లీ గేట్ సి) కాశ్మీరీ గేట్ డి) పైవేవీ కావు

6. స్వాతంత్ర్యం వచ్చేనాటికి కింది వారిలో ఎవరు బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు?

ఎ) లార్డ్ మౌంట్ బాటన్ బి) విన్స్టన్ చర్చిల్ సి) క్లెమెంట్ అట్లీ డి) రామ్‌సే మెక్‌డొనాల్డ్

7. కింది వారిలో ఎవరిని ‘ఐరన్‌ మ్యాన్‌ ఆప్‌ ది ఇండియా’ అని పిలుస్తారు?

ఎ) లాల్ బహదూర్ శాస్త్రి బి) భగత్ సింగ్ సి) సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ డి) చంద్రశేఖర్ ఆజాద్

8. భారత జాతీయ వారసత్వ జంతువు ఏది

ఎ) పులి బి) ఏనుగు సి) సింహం డి) ఒంటె

9. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు?

ఎ) మహాత్మా గాంధీ బి) జవహర్‌లాల్ నెహ్రూ సి) మోతీలాల్ నెహ్రూ డి) A.O హ్యూమ్

10. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ నగరం నుంచి వ్యాపారం ప్రారంభించింది?

ఎ) సూరత్ బి) కలకత్తా సి) బొంబాయి డి) గుజరాత్

సరైన సమాధానాలు ఇవే.. 1- ఎ, 2-డి, 3-డి, 4-సి, 5-ఎ, 6-సి, 7-సి, 8-బి, 9-డి, 10-ఎ