AP HMFW Recruitment 2022: టెన్త్/ఇంటర్ అర్హతతో.. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 171 ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 171 అనస్థీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయో మెడికల్ ఇంజనీర్ తదితర (Anesthesia Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..
AP HMFW Ananthapuramu Paramedical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 171 అనస్థీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయో మెడికల్ ఇంజనీర్ తదితర (Anesthesia Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఫార్మసీ, యూపీ, పీజీ, డిప్లొమా, బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, ఎం ఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.250లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 20, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.15000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
విభాగాలవారీగా ఖాళీల వివరాలు:
- అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 6
- ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు: 3
- బయో మెడికల్ ఇంజనీర్ పోస్టులు: 2
- కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు: 2
- క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ Gr-II పోస్టులు: 2
- డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 1
- రేడియోగ్రాఫర్ పోస్టులు: 13
- ECG టెక్నీషియన్ పోస్టులు: 4
- EEG టెక్నీషియన్ పోస్టులు: 1
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 4
- జనరల్ డ్యూటీ అటెండెంట్లు పోస్టులు: 49
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 3
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 5
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 21
- MRI టెక్నీషియన్ పోస్టులు: 3
- OT టెక్నీషియన్ పోస్టులు: 4
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు: 1
- పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు: 1
- ఫార్మసిస్ట్ గ్రేడ్ -II పోస్టులు: 12
- అణు భౌతిక శాస్త్రవేత్త పోస్టులు: 1
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 3
- ప్లంబర్ పోస్టులు: 2
- రేడియోథెరపీ టెక్నీషియన్ పోస్టులు: 2
- స్టెరిలైజేషన్ టెక్నీషియన్ పోస్టులు: 2
- శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 9
- మహిళా నర్సింగ్ ఆర్డర్లీ(FNO) పోస్టులు: 13
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.