AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: వెల్లివెరిసిన దేశభక్తి.. ఉప్పొంగిన భారతావని.. ఇండియా మ్యాప్ రూపంలో విద్యార్థుల మానవహారం

భారతావని 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ క్రమంలో...

Video Viral: వెల్లివెరిసిన దేశభక్తి.. ఉప్పొంగిన భారతావని.. ఇండియా మ్యాప్ రూపంలో విద్యార్థుల మానవహారం
India Map
Ganesh Mudavath
|

Updated on: Aug 15, 2022 | 10:53 AM

Share

భారతావని 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కు చెందిన వేలాది మంది విద్యార్థులు వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్ధులు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి భారతదేశ మ్యాప్‌ ఆకారంలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడి ప్రపంచ రికార్డు సాధించారు. జ్వాలా సామాజిక సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆగస్టు 13న ఇండోర్‌లోని దివ్య శక్తిపీఠంలో భారత చిత్రపటం రూపంలో 5,335 మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు నిల్చున్నారు. అతి పెద్ద మానవ హారంగా ఏర్పడి దేశం మ్యాప్‌ను రూపొందించారు. ఈ వీడియో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. కాగా.. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసినట్లు జ్వాలా సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ దివ్య గుప్తా వెల్లడించారు.

భారత్‌ మ్యాప్‌ బోర్డర్‌లోనే కాకుండా లోపల కూడా జాతీయ జెండా రంగులు, అశోక చక్రం రూపంలో విద్యార్థులు నిలబడినట్లు వెల్లడించారు. దేశంలోని మహిళల ప్రాముఖ్యత, శక్తిని చాటేలా భారత్‌ మ్యాప్‌ బార్డర్‌ చూట్టూ మహిళలు నిలబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. క్లిప్ ను చూసిన నెటిజన్లు వివధ రకాలుగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని స్వాతంత్ర్య దినోత్సవ కథనాల కోసం క్లిక్‌ చేయండి..