AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను వక్రీకరించొద్దు.. సోనియాగాంధీ ఘాటు వ్యాఖ్యలు..

గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశం సైన్స్, విద్య, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తూ..అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిందని కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ

Independence Day: రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను వక్రీకరించొద్దు.. సోనియాగాంధీ ఘాటు వ్యాఖ్యలు..
Amarnadh Daneti
|

Updated on: Aug 15, 2022 | 12:13 PM

Share

Independence Day: గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశం సైన్స్, విద్య, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తూ..అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిందని కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆమె తన సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ.. దూరదృష్టి గల నాయకుల నాయకత్వంలో స్వేచ్ఛ, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నామని, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వం ద్వారా భారత్ ఎంతో గుర్తింపు పొందిందన్నారు. 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, అయితే నేడు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, దేశం సాధించిన విజయాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. మహత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్ వంటి గొప్ప జాతీయ నాయకులను తక్కువ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సోనియా గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా.. కరోనా పాజిటివ్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొనలేదు. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రయాంక గాంధీ కరోనా పాజిటివ్ కారణంగా ఐసోలేషన్ లో ఉండటంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నేరుగా పాల్గొనలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్