Cloudburst: క్లౌడ్‌ బరెస్ట్‌తో భారీ విధ్వంసం.. క్షణాల్లో మాయమైన ఇళ్లు, దుకాణాలు.. షాకింగ్ వీడియో వైరల్‌

ANI షేర్‌ చేసిన ఈ వీడియోపై సమాచారం కూడా ట్విట్‌ చేసింది. భారీ వర్షం కారణంగా అక్కడ అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. కళ్లముందే దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు.

Cloudburst: క్లౌడ్‌ బరెస్ట్‌తో భారీ విధ్వంసం.. క్షణాల్లో మాయమైన ఇళ్లు, దుకాణాలు.. షాకింగ్ వీడియో వైరల్‌
Cloudburst
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 14, 2022 | 9:26 PM

Cloudburst: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్‌బర్స్ట్ లాంటి పరిస్థితి ఏర్పడింది. క్లౌడ్‌ బర్ట్స్‌తో హిమాచల్ ప్రదేశ్‌లోని కులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం,కులు నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేఘ విస్ఫోటనం కారణంగా క్షణాల్లో పెను విపత్తు సంభవించింది. కరెంట్‌ స్తంభాలు నేలకూలాయి. వరదల ధాటికి దుకాణాలు వరుసగా కొట్టుకుపోయాయి. ప్ర‌స్తుతం ఈ షాకింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో పాటు భారీ వ్యూస్‌ని సాధించింది.

ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని జరిగినట్టుగా తెలిసింది. ANI షేర్‌ చేసిన ఈ వీడియోపై సమాచారం కూడా ట్విట్‌ చేసింది. భారీ వర్షం కారణంగా కులులోని అని బ్లాక్‌లలో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్‌ అవుతారు. దుకాణాల వరుసలు వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు భయానకంగా కనిపించాయి. క్షణాల్లో అక్కడ ఉన్న దుకాణాలన్నీ మాయమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆగస్టు 16 వరకు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 44 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కులు, చంబా జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వర్షం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 67,198 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ