Azadi Ka Amrit Mahotsav: ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రసంగం.. భారీగా భద్రతా ఏర్పాట్లు

ఇందుకోసం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వేల మందికి పైగా పోలీసులతో అధికారులు ఎర్రకోట వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే..

Azadi Ka Amrit Mahotsav: ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రసంగం.. భారీగా భద్రతా ఏర్పాట్లు
Red Fort
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 14, 2022 | 8:15 PM

Azadi Ka Amrit Mahotsav: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట వద్ద అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  ఆగస్టు 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వేల మందికి పైగా పోలీసులతో అధికారులు ఎర్రకోట వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ ఏం జరిగినా వెంటనే తెలిసేలా ఎర్రకోట చుట్టూ 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా పర్యవేక్షణకు ఎర్రకోట వద్ద కంట్రోల్ రూమ్స్, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు.

భారీ భద్రతా ఏర్పాట్లు.. ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది VIPలు/VVIPలు, NCC బృందాలు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రత్యేక భద్రతా బృందం VVIP కాన్వాయ్‌ని పర్యవేక్షిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా జనాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కోవిడ్-19 ప్రోటోకాల్ కూడా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. దీనితో పాటు ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోని గగనతలం పూర్తి రక్షణ వలయంలో ఉంటుంది.

10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)తో కూడిన కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి దాదాపు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు.

ఇవి కూడా చదవండి

5 కి.మీ మేర ‘నో కైట్ ఫ్లయింగ్ జోన్’ డ్రోన్లు, UAVల నుండి ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి ఎర్రకోట ప్రాంతంలోని టెర్రస్‌లు, ఇతర సున్నితమైన ప్రదేశాలపై 400 కంటే ఎక్కువ గాలిపటాలు ఎగురవేస్తున్నా, ఇతర ఎగురుతున్న వస్తువులను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులను మోహరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వరకు ఎర్రకోట చుట్టూ ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని ‘నో కైట్ ఫ్లయింగ్ జోన్’గా గుర్తించారు.

7 వేల మంది అతిథులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈసారి ఆహ్వానితుల సంఖ్య ఏడు వేలకు పెరిగింది.ఈ క్రమంలోనే భద్రత ఏర్పాట్లు సైతం మరింత పటిష్టంగా చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇతర భద్రతా సంస్థలు కూడా ‘యాంటీ డ్రోన్ సిస్టమ్స్’ని ఏర్పాటు చేశాయి.. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రకోట, ఆ చుట్టుపక్కల అత్యాధునిక భద్రతా కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ఫుటేజీని 24 గంటలు పర్యవేక్షిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి