Mahatma Gandhi Temple: మహాత్మా గాంధీ ఆలయంలో కిక్కిరిసిన దేశభక్తులు.. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు

ఇక్కడ మరో విశేషం ఏంటంటే...చుట్టుపక్కల గ్రామాలలో పెళ్లైన జంటలకు వారి పెళ్లి రోజున పట్టు వస్త్రాలు అందించడం ప్రారంభించినట్టు ఆలయ ట్రస్ట్‌ తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రికలు

Mahatma Gandhi Temple: మహాత్మా గాంధీ ఆలయంలో కిక్కిరిసిన దేశభక్తులు.. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
Mahatma Gandhi Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 14, 2022 | 7:18 PM

Mahatma Gandhi Temple in Telangana: మన దేశంలో దేవతలతో పాటు పలువురు ప్రవక్తలకు, స్వామీజీలకు కూడా కొందరు ఆలయాలను కట్టించారు. ఆ గుడిలో నిత్య పూజలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని చోట్ల మన జాతిపిత మహాత్మ గాంధీకి కూడా గుడి కట్టి పూజిస్తున్నారు జనం. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశమంతటా స్వాత్రంత్య దినోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని మహాత్మగాంధీ ఆలయంలో కూడా దేశ భక్తుల రద్దీ కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని పెద్దకాపర్త్తి అనే ఊరిలో జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆలయం నిర్మించారు. రోజూ ఈ గాంధీ ఆలయానికి దాదాపు 60 నుండి 75 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునేవారు అయితే, ప్రస్తుతం ఇక్కడికి వచ్చే దేశభక్తుల సంఖ్య బాగా పెరిగింది. 75ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈ ఆలయం కిటకిటలాడుతుంది.

హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలోని చిట్యాల్ పట్టణం చుట్టుపక్కల ప్రజలకు మహాత్మా గాంధీ ఆలయాన్ని సందర్శించడం ఒక భావోద్వేగ చర్యగా మారింది. జిల్లాలోని చిట్యాల పట్టణ సమీపంలోని పెద్ద కాపర్తి గ్రామంలో తొలిసారిగా సుదూర ప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి.. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి జాతిని విముక్తి గావించిన ఆ మహనీయుడిని స్మరించుకుంటూ..ఇలా గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నామని చెబుతున్నారు ‘మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్’ కార్యదర్శి పివి కృష్ణారావు.

సాధారణంగా 60-70 మంది సందర్శకులు వచ్చే ఈ ఆలయానికి 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం చొరవతో ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగిందని చెప్పారు. దాదాపు 350 మంది భక్తులు వస్తున్నారని పీవీ కృష్ణారావు చెప్పారు. ఈ ఆలయాన్ని 2014లో నిర్మించారని చెప్పారు. అయితే, గతంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉండేవి కావన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతినాడు మాత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భక్తుల రద్దీ విశేష పూజల నేపథ్యంలో ఆలయానికి మంచి గుర్తింపు వస్తోందన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో మహాత్మా గాంధీ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ మరో విశేషం ఏంటంటే…చిట్యాల్ చుట్టుపక్కల గ్రామాలలో పెళ్లైన జంటలకు వారి పెళ్లి రోజున పట్టు వస్త్రాలు అందించడం ప్రారంభించినట్టు ఆలయ ట్రస్ట్‌ తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసే ముందు గ్రామస్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి..బాపు ఆశీస్సులు పొందడం కొత్త ఆనవాయితీగా మారిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించగా, తాను గాంధీజీని స్వాతంత్య్ర పోరాటానికే పరిమితం చేయమన్నారు కృష్ణారావు. “మేము అతన్ని మహాత్ముడిగా కాకుండా మహితాత్ముడిగా చూస్తాము” అని చెప్పారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి