JK Rowling Death Threat: హ్యారీపోటర్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌కు బెదిరింపులు!.. రష్దీ తరువాత నువ్వే అంటూ..
‘కంగారు పడొద్దు.. ఆ తర్వాత నువ్వే..’ అని బెదింపులకు పాల్పడ్డాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే..
JK Rowling Death Threat: హ్యారీపోటర్ నవలా రచయిత్రికి బెదిరింపులు వచ్చాయి. బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్ (57 ఏళ్లు)కు పాకిస్తాన్ చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో దాడికి గురైన ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ విన్నర్ సల్మాన్ రష్దీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. జేకే రౌలింగ్ ట్విట్ చేశారు. జరిగిన ఘటన బాధకరం అంటూ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర ఆవేదనకు గురయ్యాను.. ఆయన క్షేమంగా ఉండాలని ట్విట్ చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు.
‘కంగారు పడొద్దు.. ఆ తర్వాత నువ్వే..’ అని బెదింపులకు పాల్పడ్డాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం రష్దీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిసింది. సల్మాన్ రష్దీ ఇప్పుడు వెంటిలేటర్‌పై లేరని, మాట్లాడుతున్నారని చటాక్వా ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ మైఖేల్ హిల్ తెలిపారు. చటాక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపై కత్తితో దాడి చేయడంతో ప్రఖ్యాత రచయిత రష్దీ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. సల్మాన్ రష్దీ ఇప్పుడు వెంటిలేటర్‌పై లేరని, కోలుకుంటున్నారని, హిల్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి