Plane Landing: ఈ తరహా విమానం ల్యాండింగ్ ఎప్పుడూ చూసి ఉండరు.. మనుషుల తలలు తాకుతూ వెళ్తోంది.. వైరలవుతున్న వీడియో

సోషల్ మీడియాలో అనేక వీడియోల ద్వారా అనేక సాహసాలను చూస్తాము. ఇది కూడా అలాంటి సాహసమే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఓ విమానం ల్యాండింగ్‌ దృశ్యం అక్కడి వారితో పాటు,

Plane Landing: ఈ తరహా విమానం ల్యాండింగ్ ఎప్పుడూ చూసి ఉండరు.. మనుషుల తలలు తాకుతూ వెళ్తోంది.. వైరలవుతున్న వీడియో
Lowest Landing
Follow us

|

Updated on: Aug 14, 2022 | 3:47 PM

Plane Landing: మనం జీవితంలో ప్రతిరోజూ వ్యక్తిగతంగా, సోషల్ మీడియాలో అనేక వీడియోల ద్వారా అనేక సాహసాలను చూస్తాము. ఇది కూడా అలాంటి సాహసమే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఓ విమానం ల్యాండింగ్‌ దృశ్యం అక్కడి వారితో పాటు, నెటిజన్లను సైతం షాక్‌ అయ్యేలా చేస్తోంది. గ్రీస్‌లోని స్కియాథోస్ అలెగ్జాండ్రోస్ పాపాడియామాంటిస్ ఎయిర్‌పోర్ట్‌లో బాటసారుల తలపై విమానం ప్రమాదకరంగా దిగుతున్న దృశ్యాలు సాహసం కంటే తక్కువేమీ కాదు. గ్రీస్‌లోని (Greece) స్కియాథోస్‌ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ (landing) అయిన విజ్‌ఎయిర్‌ ఎయిర్‌బస్‌ ఏ321నియో ప్లేన్‌ దృశ్యాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. సముద్రపు నీటిని, మనుషులను తాకుతుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్‌ పపడియామంటిస్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ఈ ప్లేన్ దిగింది. విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా? అన్నట్లు కనిపించింది.

స్కియథోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే (runway) కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్‌పోర్ట్‌ 1972లో ప్రారంభమైంది. ఈ స్కియాథోస్ అలెగ్జాండ్రోస్ విమానాశ్రయం.. జీవితంలో సాహసం చేయాలనుకునే వ్యక్తులకు చాలా ప్రసిద్ధ గమ్యస్థానంలాంటిది. స్కియాథోస్ అలెగ్జాండ్రోస్ విమానాశ్రయంలో రన్‌వే చాలా చిన్నది. అందువల్ల పైలట్లు వేగాన్ని తగ్గించి తక్కువ ఎత్తులో ల్యాండ్ చేయాలి. ‘గ్రేట్ ఫ్లైయర్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో షేర్ చేయబడింది. విమానం దీవిలోకి రావడంతో వీడియో ప్రారంభమవుతుంది. విమానం ఎంత దిగువకు ఎగురుతుందో చూపించడానికి కెమెరా సముద్రంలో పడవలను జూమ్ చేస్తుంది. ఇది భూమికి చేరువవుతున్నప్పుడు, ఫ్లైట్ రన్‌వేపై చివరగా తాకడానికి ముందు మళ్లీ ఎత్తు పడిపోవడాన్ని చూడవచ్చు. వీక్షకుల తలల మీదుగా వెళుతుంది.

ఇవి కూడా చదవండి

ల్యాండింగ్‌ను స్పష్టంగా క్యాప్చర్ చేసి, అనేక కోణాల నుండి చూపించినందుకు యూట్యూబ్ ఛానెల్‌ని కొందరు ప్రశంసించారు. తద్వారా ఇది ఎంత తక్కువగా ఉందో ప్రజలకు స్పష్టమైన ఆలోచన వస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి