AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: రాజధానిలో కరోనా డేంజర్ బెల్స్.. గుబులు రేపుతున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌.. లాక్‌డౌన్‌ తప్పదా..?

హాస్పిటల్‌లోని రోగుల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఓమిక్రాన్ కొత్త సబ్-వేరియంట్ BA 2.75 గుర్తించారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా చెప్పారు.

Covid 19: రాజధానిలో కరోనా డేంజర్ బెల్స్.. గుబులు రేపుతున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌.. లాక్‌డౌన్‌ తప్పదా..?
Omicron Variant
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2022 | 9:18 PM

Share

Omicron sub vaient: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి భయానకంగా మారుతోంది. గత వారం నుంచి కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్‌(కొత్త సబ్-వేరియంట్ BA 2.75) ను ఢిల్లీలోని ఓ హాస్పిటల్ గుర్తించింది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని గుర్తించారు.. ఇలాంటి పలు కీలక అంశాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. లేదంటే.. రూ. 500 జరిమానా విధించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరపున జిల్లా మేజిస్ట్రేట్‌లందరూ తమ ప్రాంతంలో సామాజిక దూరం నిబంధనలను పాటించాలని కోరారు.

వీటన్నింటి మధ్య, ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లోని రోగుల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఓమిక్రాన్ కొత్త సబ్-వేరియంట్ BA 2.75 గుర్తించారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా చెప్పారు. ఢిల్లీలోని కోవిడ్ రోగుల నుండి తీసుకున్న చాలా నమూనాలలో ఓమిక్రాన్ కొత్త ఉప-వేరియంట్‌ని గుర్తించారు. ఈ రోగుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని ఈ వారంలో పూర్వి నివేదిక వెల్లడిస్తామని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఈ నమూనాలలో సగానికి పైగా ఓమిక్రాన్ సబ్ వేరియంట్ యొక్క కొత్త సబ్-వేరియంట్ BA 2.75 ఉనికిని కనుగొన్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ -19 రోగులు మార్చి 2020 నుండి LNJP ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. LNJP రోగుల కోసం 2000 పడకల ఆస్పత్రి. ఇది ఢిల్లీ ప్రభుత్వ అధీనంలోని అతిపెద్ద ఆసుపత్రి. అయితే, ఈ వేరియంట్‌లను గుర్తించిన రోగులు ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కానీ, ఈ కొత్త వేరియంట్ మరింత అంటువ్యాధిగా నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల మేరకు…ఆగస్టు 1 నుంచి 10 మధ్య దేశ రాజధానిలో 19,760 కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో కంటైన్‌మెంట్ జోన్‌ల సంఖ్య కూడా దాదాపు 50 శాతం పెరిగింది. సుమారు 180 రోజుల తర్వాత, బుధవారం ఢిల్లీలో 8 మంది రోగులు కోవిడ్ -19 బారినపడి మరణించారు.2,146 కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి. మంగళవారం, 2,495 కేసులు నమోదయ్యాయి మరియు ఏడుగురు మరణించారు, సంక్రమణ రేటు 15.41 శాతంగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ల నేపథ్యంలో 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. పండుగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వృద్దులు, పిల్ల‌ల్లో ఈ వేరియంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి