AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video : ఇలాంటి కప్ప నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. మనిషిని మించిపోయింది..! వీడియో చూస్తే షాక్ అవుతారు

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక కప్ప నీటిలో ఏదో ఆకులాంటి ఆధారంపై కూర్చుని హాయిగా ప్రయాణిస్తుంది. దాంతో పాటే మరో కప్పకూడా ఉంది...అయితే, ఆ రెండు కప్పలకు అక్కడ

Funny Video : ఇలాంటి కప్ప నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. మనిషిని మించిపోయింది..! వీడియో చూస్తే షాక్ అవుతారు
Frogs
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2022 | 3:22 PM

Share

Funny Video : వివిధ రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉంటాయి. వీటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ప్రస్తుతం నెట్టింట కప్పకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కప్పలను చూసే ఉంటారు. కప్పలు తరచుగా వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నీటిలో అక్కడక్కడ దూకడం వీటి ప్రత్యేకత. కప్పలు ఎగరడానికి సంబంధించి అనేక వీడియోలను గతంలో చూసే ఉంటారు. కానీ, ఇక్కడ కనిపించే కప్పలాంటి దాన్ని మాత్రం మరెప్పుడూ ఎక్కడ చూసి ఉండరు. ఎందుకంటే, ఇక్కడ ఒక కప్ప మరోకప్పను కాళ్లు పట్టి నీటిలోకి లాగేస్తుంది. అవును, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇది చాలా ఫన్నీ, ఆశ్చర్యకరమైన వీడియో కూడా.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక కప్ప నీటిలో ఏదో ఆకులాంటి ఆధారంపై కూర్చుని హాయిగా ప్రయాణిస్తుంది. దాంతో పాటే మరో కప్పకూడా ఉంది…అయితే, ఆ రెండు కప్పలకు అక్కడ స్థలం సరిపోనులేదు..దాంతో ఒకటి మాత్రమే ఆధారంపై కూర్చుని వెళ్లగలుగుతుంది. దాంతో రెండో కప్ప నీళ్లలో పడిపోయింది. తాను నీళ్లలో కష్టపడి తేలుతూ వెళ్లాల్సింది వస్తుందని భావించిందో ఏమోగానీ, ఆకుపై ఉన్న కప్పను కాళ్లు పట్టి నీటిలోకి లాగడం ప్రారంభిస్తుంది.. దాంతో ఆకుపై ఉన్న కప్ప ఒక్క తన్ను తన్నేసింది. కానీ, ఆ కప్పను వదలేదు..మరో మారు ప్రయత్నిస్తుంది. కప్ప కాలు పట్టుకుని మరోసారి లాగాలని చూసింది…కానీ ప్రతిసారీ దాని ప్రయత్నం విఫలమైంది. ఇలాంటి ఘటనలు మాటలు నేర్చిన మనుషులు చేస్తారు..కానీ, మూగజీవాలు..అది కూడా ఒక కప్ప ఎదుటి కప్పను కాలుపట్టి లాగి పడేయాలని చూడటం నిజంగా అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో బ్యూటెంగెబిడెన్ పేరుతో షేర్ చేయబడింది. కేవలం 11 సెకన్ల ఈ వీడియోకి ఇప్పటి వరకు 13 మిలియన్లు అంటే 1.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. 4 లక్షల 21 వేల మందికి పైగా ఈ వీడియోను కూడా లైక్ చేసారు.

ఈ వీడియో చూసిన జనాలు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియో చూసి కొందరు నవ్వుతూ చిరాకు పడుతుంటే, మరికొందరు కప్ప తన సహచరులను ఎలా ‘లాగుతోందో’ అని ఆశ్చర్యపోతున్నారు.