Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్‌.. ఈ నెల 20న జరిగే సభకు ఇంచార్జీలు

మునుగోడు బైపోల్‌.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తుంది. ఇన్నాళ్లు జరిగింది ఒక ఎత్తు. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. మునుగోడు మరో రెండు మూడు నెలలపాటు హోరెత్తబోతోంది. సాధారణంగా ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చిన తర్వాతే హీట్‌ పెరిగేది. మునుగోడులో మాత్రం..

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్‌.. ఈ నెల 20న  జరిగే సభకు ఇంచార్జీలు
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2022 | 5:33 PM

బైపోల్‌ డేట్‌ రాలేదు. కానీ రాజకీయం హైఓల్టేజ్‌కి చేరిపోయింది. మునుగోడు బైపోల్‌.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తుంది. ఇన్నాళ్లు జరిగింది ఒక ఎత్తు. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. మునుగోడు మరో రెండు మూడు నెలలపాటు హోరెత్తబోతోంది. సాధారణంగా ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చిన తర్వాతే హీట్‌ పెరిగేది. మునుగోడులో మాత్రం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదంతోనే మొదలైపోయింది. మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్‌ పెంచారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR). ఈ నెల 20న నియోజకవర్గంలో తలపెట్టిన బహిరంగ సభను గ్రాండ్‌ సక్సెస్‌ చేయడమే లక్ష్యంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. సభానిర్వహణ కోసం ఇంచార్జ్ లను నియమించారు. జన సమీకరణ బాధ్యతను వారికే అప్పగించారు. మునుగోడు లోకల్‌, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలకి.. చౌటుప్పల్ మున్సిపాలిటీ బాధ్యతని ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎంపీ లింగయ్య యాదవ్‌లకు అప్పజెప్పారు.. చౌటుప్పల్ రూరల్ నుంచి జనసమీకరణను ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్… మర్రిగూడ నుంచి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి చూసుకుంటారు.

  • మునుగోడు : మంత్రి జగదీష్ రెడ్డి,నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
  •  చౌటుప్పల్ మున్సిపాలిటీ : మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్.
  • చౌటుప్పల్ రూరల్ : హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
  •  మర్రిగూడ : భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి…
  •  నాంపల్లి : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్,ఎమ్మెల్సీ కోటిరెడ్డి.
  • చండూరు మున్సిపాలిటీ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య…
  • చండూరు రూరల్ : నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్,యాదాద్రి జిల్లా జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి.
  • నారాయణపురం : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత.

అంతాకలిసి పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం