Telangana: విపక్షాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. రాజకీయాల కోసం ఇలా చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు

విపక్షాలు కక్కుర్తి రాజకీయాలకు తెర లేపాయని తెలంగాణ (Telangana) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ అంశంపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు...

Telangana: విపక్షాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. రాజకీయాల కోసం ఇలా చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు
Srinivas Goud
Follow us

|

Updated on: Aug 14, 2022 | 6:45 PM

విపక్షాలు కక్కుర్తి రాజకీయాలకు తెర లేపాయని తెలంగాణ (Telangana) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ అంశంపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లు అర్థరహితమని వ్యాఖ్యానించారు. తాను పేల్చింది రబ్బర్‌ బుల్లెట్‌ అని మరోసారి స్పష్టం చేశారు. సర్దార్‌ సర్వాయి పాపన్న, కుమురం భీం, ప్రొఫెసర్‌ జయశంకర్‌, చాకలి ఐలమ్మ లాంటి మహనీయుల జయంతి వేడుకలను అన్ని వర్గాలు కలిసి చేసుకోవడం మంచి పరిణామనని, దీని ద్వారా చక్కటి సమాజ స్ఫూర్తి అలవరుతుందని వ్యఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారుర. దేశ వ్యాప్తంగా 52 శాతం పైగా జనాభా కలిగిన బీసీల కోసం ఓ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి, వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలన్న ధ్యాస తప్ప కేంద్రలోని బీజేపీకి మరో ఆలోచనే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. నిన్న (శనివారం) మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది. విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి నిర్వహించే ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. అనంతరం తన పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ చేతిలోని తుపాకీ తీసుకుని మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు ఒక మంత్రే ఇలా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం