Hyderabad: భాగ్యనరవాసులకు ముఖ్య సూచన.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడంటే..
తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ (Hyderabad) జల మండలి కీలక సూచనలు చేసింది.
భాగ్యనగరవాసులకు (Hyderabad) హైదరాబాద్ జల మండలి ఓ ముఖ్య సుచన చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(KDWSP) ఫేజ్ – 1కి సంబంధించి మిరాలం ఆలియాబాద్ ఆఫ్టేక్ వద్ద 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్కు జంక్షన్ పనులు జరపాల్సి ఉంది. ఎస్ఆర్డీపీలో భాగంగా ఫలక్నుమాలోని అల్జుబైల్ కాలనీ వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా ఈ పనులు జరగనున్నాయి. ఈ పనులు మంగళవారం(16.08.2022 ) ఉదయం 6 గంటల నుంచి బుధవారం(17.08.2022) సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 36 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 1 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. కావున నగరంలోని ఈ పరిసరాల్లోనివారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది హైదరాబాద్ జల మండలి.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 – మిరాలం, కిషన్బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2ఏ – సంతోష్నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్గూడ, అస్మాన్గఢ్, యాకూత్పురా, మాదన్నపేట, మహబూబ్ మాన్షన్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2బీ – రియాసత్నగర్, ఆలియాబాద్, బాలాపూర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – బొగ్గులకుంట, అప్జల్గంజ్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – నారాయణగూడ, అడిక్మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10ఏ – దిల్సుఖ్నగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు. 7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – బొంగుళూరు రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 25 – మన్నెగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు.
దీంతో పాటు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 2, 3కి సంబంధించి గొడకొండ్ల 132 కేవీ సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మార్లను టీఎస్ట్రాన్స్కో మార్చనుంది. తేదీ: 16.08.2022, మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 3 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 3 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 2, 3 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్, శాస్త్రిపురం, బండ్లగూడ. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 3 – మెహదీపట్నం, కార్వాన్, లంగర్హౌజ్, కాకతీయనగర్, హుమాయున్ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్నగర్, ఎంఈఎస్, షేక్పేట్, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ, భోజగూట్ట, చింతల్బస్తీ. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – జియాగూడ, రెడ్ హిల్స్, సెక్రటేరియట్, ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్, అల్లాబండ. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – గగన్మహాల్, హిమాయత్నగర్, మేకలమండి, భోలక్పూర్. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ. 7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్పేట్, ఫిరోజ్గూడ, గౌతమ్నగర్. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – సాహేబ్నగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహేంద్రహిల్స్, సైనిక్పురి, మౌలాలి. 10. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – వెలుగుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, స్నేహపురి, కైలాస్గిరి, దేవేంద్రనగర్. 11. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరీ హిల్స్. 12. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 16 – మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, నైన్ నెంబర్, హైదర్గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, ఎంఎం పహాడీ, చింతల్మెట్, కిషన్భాగ్. 13. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 18 – గంధంగూడ, మణికొండ, నార్సింగి, కిస్మత్పూర్. 14. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్, మల్లికార్జుననగర్, మాణిక్చంద్, చెంగిచర్ల, భరత్నగర్, ఫీర్జాదిగూడ. 15. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్పేట, లెనిన్నగర్, బడంగ్పేట, ధర్మసాయి. 16. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 22 – మన్నెగూడ, తుర్కయంజాల్.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం