Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48గంటల పైనే..

ఆదివారం సాయంత్రం 4గంటల వరకే 50,443 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరో వైపు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి..

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48గంటల పైనే..
TTD
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 14, 2022 | 5:46 PM

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48గంటల పైనే.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు సేవాసదన్‌ దాటి రింగ్‌రోడ్డు వరకు భక్తులు బారులు తీరారు. ఆదివారం సాయంత్రం 4గంటల వరకే 50,443 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరో వైపు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ నెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనం, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు తెలిపారు. వసతి గదులు కూడా దొరక్కపోవడంతో చాలా మంది భక్తులు చలిలో, చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

మరోవైపు, సెప్టెంబర్ 27 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్‌ 27న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి