Viral Video: ఇంగ్లీష్‌లో బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ కథ..అద్భుతమైన వీడియో వైరల్..
బ్రాహ్మణులు ఇంగ్లీషులో సత్యనారాయణ కథను ఎలా చెబుతున్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ ఇంట్లోని వారంతా భక్తి శ్రద్ధలతో సత్యన్నారయణ స్వామి వ్రత కథను వింటున్నారు.
Viral Video: ప్రస్తుత యుగం ఇంటర్నెట్ యుగం. ఈ ఇంటర్నెట్ యుగంలో ఏదైనా భిన్నమైన విషయం ఉంటే..అది తక్షణం వైరల్ అవుతుంది. అలాంటి వీడియోలు నిత్యం నెట్‌లో అనేకం చూస్తుంటారు..వీటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా కూడా ఉంటాయి. తమాషా వీడియోలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో వేలాది మంది వీక్షించారు. అలాగే లక్షలాది మంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముంది..? మీరు ఇప్పటి వరకు సంస్కృతం, మరాఠీ మరియు హిందీలో సత్యనారాయణ కథను విని ఉండవచ్చు, కానీ ఈ వైరల్ వీడియోలో, ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ కథను ఆంగ్లంలో వివరిస్తున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు కథను శ్రద్ధగా వింటున్నారు. వీడియోను బట్టి చూస్తే, అతను సౌత్ ఇండియాకు చెందినవాడని తెలుస్తోంది. ఇంతకుముందు సత్యనారయణ భగవాన్ జీ కథ సంస్కృతంలో ఉండేది, ఆ తర్వాత హిందీలోనూ, తెలుగులోనూ జరగడం మొదలైంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామివారి వ్రతకథను ఇంగ్లీష్ లో వినండి..
पहले सत्यनारायण भगवान जी की कथा संस्कृत में होती थी फिर हिंदी में होने लगी अब इंग्लिश में सत्यनारायण जी की कथा सुनिए। pic.twitter.com/ZQhVDYBLfT
— skand shukla (@skandshukla) August 13, 2022
బ్రాహ్మణులు ఇంగ్లీషులో సత్యనారాయణ కథను ఎలా చెబుతున్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ ఇంట్లోని వారంతా పురుషులు, మహిళలు, పిల్లలు అతని మాటలను శ్రద్ధగా వింటున్నారు. వీడియోలోని మహిళలు ధరించిన దుస్తులు, వీడియోలో కనిపించే పూజా సామగ్రి, దానిని ప్రదర్శించిన విధానం దక్షిణ భారత సంస్కృతిని తలపించేలా ఉన్నాయి. నిజానికి, దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ దేవుడి కథ ఇంగ్లీషులో కూడా చెప్పడానికి కారణం ఇదే కావచ్చు. ఇదిలా ఉండగా పూజాకు సంబంధించిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన జనాలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది భారతదేశం పురోగతి గురించి మాట్లాడుతున్నారు. మరికొందరు కొత్త ఆలోచన, కొత్త శైలిగా అభివర్ణిస్తున్నారు. మరో వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, ‘ఇది మంచి మార్గం. దీని ద్వారా బ్రిటీష్ వారికి కూడా హిందూమతం గురించిన విజ్ఞానాన్ని వివరించవచ్చు అన్నారు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది తమ కామెంట్లను ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి