AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కాటేసిన పామును కొరికి చంపేసిన 2 ఏళ్ల చిన్నారి.. ప్రజంట్ పాపకు ఎలా ఉందంటే..?

ఆ బుజ్జితల్లి ఉన్నవద్దకు పాము వచ్చిందో.. లేక చిన్నారే తెలియక పాము వద్దకు వెళ్లిందో తెలియదు కానీ అనుకోని ఘటన జరిగింది. మీకు సూచన ఏంటంటే.. పసిపిల్లలను కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. వారికి ఏది మంచో, ఏది చెడో తెలియదు.

Viral: కాటేసిన పామును కొరికి చంపేసిన 2 ఏళ్ల చిన్నారి.. ప్రజంట్ పాపకు ఎలా ఉందంటే..?
Baby Kills Snake
Ram Naramaneni
|

Updated on: Aug 14, 2022 | 8:37 PM

Share

Baby kills Snake: పైన ఫోటోలోని చిన్నారి వయస్సు 2 సంవత్సరాలు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. చూడాగానే ఈ బుజ్జాయిని ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది కదూ..! తెలిసీ తెలియక తాను చేసిన పని తెలిస్తే మీరు ఒకింత షాకవ్వడం మాత్రం ఖాయం. చాలామంది పాము కనపడితే చాలు అక్కడి నుంచి లగెత్తుతారు. అమ్మో అని పరుగులు తీస్తారు. నిజమైన పాములు పక్కన పెట్టండి… సోషల్ మీడియాలో పాముల ఇమేజెస్ కనిపించినా సరే. జలదరింపుకు గురవుతారు. ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న పసికూన మాత్రం పామును నోటితో కొరికి చంపేసింది. టర్కీ(Turkey)లోని బింగోల్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆగస్టు 10వ తేదీన చిన్నారి తన ఇంటి వెనుక తోటలో ఆడుకుంటుండగా.. ఓ 20-అంగుళాల  పాము అక్కడికి వచ్చింది. అది ఆ చిన్నారిని పెదాలపై కాటు వేసింది. అయితే అది విషసర్పం అని గుర్తించక..  ఆ పసిసాప దాన్ని నోట్లో పెట్టుకుని పలుసార్లు కొరికేసింది. దీంతో ఆ స్నేక్ చనిపోయింది. అనంతరం చిన్నారి బిగ్గరగా అరవడం ప్రారంభించింది. దీంతో ఇరుగుపొరుగువారు అక్కడికి పరిగెత్తుకుని వచ్చి.. అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే ప్రథమ చికిత్స చేసి బింగోల్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారికి యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చి.. ఆపై 24 గంటలు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి బాగానే ఉందని, కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. (Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి