Kareena kapoor: శృంగారంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రశ్న.. దిమ్మదిరిగే సమాధానమిచ్చిన కరీనా, అమీర్‌ఖాన్..
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ముఖ్యంగా సీజన్ 7లో వరుసగా సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్న కరణ్..
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ముఖ్యంగా సీజన్ 7లో వరుసగా సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్న కరణ్.. వారి రహస్యాలను బయటపెడుతున్నారు. విజయ్ దేవరకొండ కారులో శృంగారం.. సమంత టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం లాంటి విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిరేపాయి. ఇక బాలీవుడ్ బెబో కరీనా కపూర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాబడుదామనుకున్న కరణ్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ‘కాఫీ విత్ కరణ్’ ఐదో ఎపిసోడ్ ప్రొమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రొమోలో ‘లాల్ సింగ్ చద్దా’ హీరోహీరోయిన్లు ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సందడి చేశారు. ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకోవడంతో పాటు కరణ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ‘పిల్లలు పుట్టాక క్వాలిటీ సెక్స్ ఉంటుందా? అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. ఈ విషయం ‘మీకు తెలియదా?’ అంటూ కరీనా కపూర్ పంచ్ ఇచ్చారు. దాంతో కరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత.. కరణ్ ‘మా అమ్మ ఈ షో చూస్తారు. నా శృంగార జీవితం గురించి మాట్లాడటం బాగుండదు’ అని కరీనా కు బదులిచ్చారు. వెంటనే స్పందించిన ఆమిర్ ఖాన్.. ‘మీరు ఇక్కడికి వచ్చిన వారందరి లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మీ అమ్మ హర్షిస్తారా’ అంటూ రివర్స్ పంచ్ వేశారు. దాంతో ముగ్గురూ కలిసి నవ్వుకున్నారు. ఈ ఎపిసోడ్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..